Prime miniser candidate
-
మోదీ కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్
ముంబై: కేందమంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ముందు, తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్ వచ్చినట్టు గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాలు తనకు మద్దుతు ఇస్తామని చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.నితిన్ గడ్కరీ తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మోదీ బదులు ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని, తాము మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షాల నుంచి నాకు ప్రపోజల్స్ వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా అలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, నేను వారి ఆఫర్‌ను తిరిస్కరించాను. మోదీ బదులుగా నేను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అనేది బీజేపీలో చీలిక కోసం ప్రతిపక్షాలు చేసిన ప్లాన్ అని నేను అనుకుంటున్నాను.మోదీ పాలనలో నేను నా బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నాకు ప్రధాని కావాలనే కోరిక ఏమీ లేదు. ఆ పదవి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కూడా లేదు. మొదట నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని, బీజేపీ కార్యకర్తను. నాకు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నాకు ఒక్కటే. నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుత బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు కేంద్రమంత్రి పదవులకు కూడా అనర్హులు అన్నట్టుగా రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తూ సీనియర్లకు బయటకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వయస్సు 74 సంవత్సరాలు కాగా.. ఆయనకు ఈ నియమం వర్తిస్తుందో లేదో తెలియదు. ప్రస్తుతం గడ్కరీ వయసు 67 సంవత్సరాలు కావడంతో గడ్కరీ ప్రధాని స్థానం ఇవ్వాలని పలువురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు కోరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇది కూడా చదవండి: మహాలక్ష్మి కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా -
నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ (72)ను నామినేట్ చేశారు. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్(ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తమ అధినేత నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మరియం తెలియజేశారు. అలాగే.. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. پاکستان مسلم لیگ (ن) کے قائد جناب محمد نوازشریف نے وزیراعظم اسلامی جمہوریہ پاکستان کے عہدے کےلئے جناب محمد شہبازشریف کو نامزد کر دیا ہے جبکہ وزیراعلی پنجاب کے عہدے کےلئے محترمہ مریم نوازشریف کو نامزد کیا ہے۔ جناب محمد نوازشریف نے پاکستان کے عوام اور سیاسی تعاون فراہم کرنے والی… — Marriyum Aurangzeb (@Marriyum_A) February 13, 2024 وزیر اعظم شہباز شریف وزیراعلیٰ مریم نواز pic.twitter.com/kW3MbqmRCv — Badar Shahbaz 🇵🇰🇵🇸 (@BSWarraich) February 13, 2024 పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: ప్రభుత్వంలో చేరబోం ఈ క్రమంలో షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. -
మా పార్టీ గెలిస్తే మా అన్నే పీఎం: షెహబాజ్
ఇస్లామాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్–ఎన్) మరోసారి విజేతగా నిలిచిన పక్షంలో తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడతారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. లండన్‌లో గడుపుతున్న నవాజ్ çస్వదేశానికి త్వరలో వస్తారన్నారు. సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా తటస్థుడిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేస్తామన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయమై భాగస్వామ్య పార్టీలతోపాటు, పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపాక నిర్ణయిస్తామని తెలిపారు. -
బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్..
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ తాను మరోసారి బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత గొప్ప దేశమైన బ్రిటన్.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తాను ప్రధాని అయి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని ఏకం చేసి అందరి మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని రిషి సునాక్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అయితే అందరూ అనుకున్న దానికంటే కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు మనకంటే ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలన్నారు. తాను పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. The United Kingdom is a great country but we face a profound economic crisis. That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister. I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK — Rishi Sunak (@RishiSunak) October 23, 2022 రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీ చేసి రెండు నెలలు కూడా గడవలేదు. లిజ్ ట్రస్‌తో పోటీ పడిన ఆయనకు సొంత ఎంపీల మద్దతు లభించినా.. పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఓట్లు రాలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ ఘోరంగా విఫలం కావడంతో 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే ఈసారి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా 100మందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే బోరిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈసారైనా రిషి ప్రధాని అవుతారో లేదో చూడాలి. చదవండి: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
‘అలా జరిగితే బలమైన ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్’
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతారనే వాదనల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటే జేడీయూ నేత నితీశ్ కుమార్ తన సద్భావనతో బలమైన ప్రధాని అభ్యర్థిగా ఎదగగలరని పేర్కొన్నారు. బిహార్‌లో మహాకూటమి అధికారంలోకి రావటాన్ని జంగిల్ రాజ్యం తిరిగి వచ్చిందనే బీజేపీ వాదనలను తిప్పికొట్టారు తేజస్వీ యాదవ్. అలసిపోయి, నక్క ఏడుపులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయటం ఐక్యతకు నిదర్శనమన్నారు. ‘చాలా ప్రతిపక్ష పార్టీలు దేశం ముందున్న పెద్ద సవాలును గుర్తించాయి. అది బీజెపీ ఆధిపత్యం. డబ్బు, మీడియా, ప్రభుత్వ ఏజెన్సీల బలంతో చలాయించే ఆధిపత్యాన్ని భారతీయ సమాజం, రాజకీయాల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వారు సహకార సమాఖ్య విధానంపై మాట్లాడుతున్నారు. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోంది. ఈ విషయంపై బీహార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ’ అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నితీశ్ సరైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? అని అడగగా తనదైన శైలీలో సమాధానమిచ్చారు తేజస్వీ యాదవ్. ‘ఈ ప్రశ్నను గౌరవ నితీశ్ జీకే వదిలేస్తున్నాను. మొత్తం విపక్షాల తరఫున నేను మాట్లాడలేను. కానీ, వారు పరిగణనలోకి తీసుకుంటే నితీశ్ జీ కచ్చితంగా బలమైన అభ్యర్థి అవుతారు. ఆయనకు 37ఏళ్ల పార్లమెంటరీ, పరిపాలన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది.’ అని తెలిపారు. ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
వివాదంలో రిషి సునాక్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
లండన్: యూకే ప్రధాని ఎన్నికలకు మరో నెలరోజుల టైం కూడా లేదు. మాజీ చాన్స్‌లర్ రిషి సునాక్, యూకే ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్ ప్రధాని రేసులో తుదిగా మిగిలారు. లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తూ వెళ్తుండగా.. ఈలోపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ చుట్టూ వివాదాలు, విమర్శలు అల్లుకుంటున్నాయి. యూకే ప్రధాని రేసులో నిలిచిన రిషి సునాక్‌ని ఇరకాటంలో పడేసేందుకు అక్కడి మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన లైఫ్ స్టైల్లోని ప్రతీ అంశాన్ని తెర మీదకు తెస్తోంది. తాజాగా.. ఆయన తన మాన్షన్‌లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్‌పూల్‌ను వివాదానికి కేంద్రంగా మార్చేశాయి అక్కడి మీడియా హౌజ్‌లు. ఇందులో వివాదం ఏముంది అంటారా? ప్రస్తుతం యూకేలో వడగాల్పులు, కరువుతో తీవ్ర నీటిఎద్దడి తాండవిస్తోంది కాబట్టి. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్‌షైర్‌లో సునాక్‌కు ఓ మాన్షన్ ఉంది. వీకెండ్లలో ఆయన, భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తుంటారు. అయితే ఏరియల్ ఫుటేజీల ద్వారా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది ది ఇండిపెండెంట్. అంతేకాదు ఆ ఫొటోలు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ పట్టణంలోని స్విమ్మింగ్ పూల్స్‌ను బలవంతంగా అధికారులు మూసేసిన విషయాన్ని సైతం లేవనెత్తుతున్నారు కొందరు. నీటి కొరత ఉన్న సమయంలో.. ఇలా భారీగా ఖర్చు చేపట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడం పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. RIshi Sunak's huge swimming pool, gym and tennis courts are nearing completion in the grounds of his Manor House near Northallerton. @RishiSunak @trussliz @yorkpress @TeessideLive #Ready4Rishi pic.twitter.com/QlqgNVcLCJ — TeesPix.Photos - Teesside Photos (@TeesPix) August 12, 2022 అయితే ఈ కుటుంబం ఈమధ్యకాలంలో ఇలా వరుసగా వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటోంది. రిషి సునాక్ భార్య అక్షత మూర్తి.. తన ఇంటికి వచ్చిన జర్నలిస్టులకు టీ ని స్వయంగా ఇచ్చారు. అయితే అందుకోసం కాస్ట్లీ కప్పులు, ట్రేను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పన్నుల పెంపు వల్ల ప్రజా జీవనం భారంగా మారిన ఇలాంటి సమయంలో.. ఇలాంటి కాస్ట్లీ చేష్టలు అవసరమా? అంటూ నిందించారు ఆమెను. ఇదీ చదవండి: భార్యకాని భార్య.. భర్తకానీ భర్త.. ఇదేం పెళ్లి!! -
2024 సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని అభ్యర్థిపై అమిత్ షా కీలక ప్రకటన
పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు. చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు.. -
టీఆర్ఎస్ ప్రధాని అభ్యర్థి ఎవరు?
హైదరాబాద్: కొన్ని రోజులుగా 16 ఎంపీ సీట్లను గెలుస్తామంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊదరగొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బీజేపీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ గ్రౌండ్స్‌లో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నా రు. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక కొద్ది రోజులకే కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి అన్ని అర్హతలు కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ విచిత్రమైన రాజకీయాలకు తెరలేపుతోందన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలంతా ఒక్కటై బీజేపీకి అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి మోదీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోదీ బీసీ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలపై ఆయన మమకారం చూపించారన్నారు. కులం రంగు పులుముకోకుండా అగ్రకులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదే అని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీరాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎవరయితే ఇంటిని చక్కదిద్దు కోలేరో వారిక దేశాన్ని ఎలా చక్కదిద్దుతారు? కనుక మీరు ముందుగా మీ కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టండి!’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి రెండవ తేదీన ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తమను కలల్లోకి తీసుకెళ్లే నాయకులను ఇష్ట పడతారు. ఒకవేళ వారి కలలను నెరవేర్చడంలో నాయకులు విఫలమయితే వారిని పట్టుకొని ప్రజలు కొడతారు. కనుక మీరు నెరవేర్చగల హామీలను మాత్రమే ఇవ్వండి’ అని జనవరి 28వ తేదీన ముంబైలో బీజేపీ అనుబంధ రవాణా సంఘం ‘నవభారతీయ శివ్ వాహతుక్ సంఘటన’ సమావేశంలో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదు. రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి. కనుక వారు విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరాదు’ అంటూ జనవరి 13వ తేదీన మహారాష్ట్రలోని యవత్మల్లో జరిగిన 92వ అఖిల భారతీయ మరాఠి సాహిత్య సమ్మేళనం’లో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సాధికారికతకు నిదర్శనం. మహిళలకు రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ రాజకీయల్లో రాణించారు’ అని జనవరి ఏడవ తేదీన నాగపూర్‌లో జరిగిన స్వయం ఉపాధి మహిళా బృందాలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో ఆయన కుల, మత రాజకీయాలను విమర్శించారు. ‘ఎవరైనా జ్ఞానం ప్రాతిపదికనే ఎదగాలి. సాయిబాబా, గజానన్ మహరాజ్ లేదా సంత్ తుక్దోజీ మహరాజ్‌ను మీది ఎమతమని అడుగుతామా? ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లేదా జ్యోతీబా ఫూలేలను మీ కులం ఏమిటని అడుగుతామా?’ ‘నేనే పార్టీ అధ్యక్షుడిని అయితే నా ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయక పోతే ఎవరిది బాధ్యత ? నాదే బాధ్యత’ అని డిసెంబర్ 25వ తేదీన ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో మాట్లాడుతూ గడ్కరీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహనం పాటించడం భారత ప్రజలకున్న పెద్ద సంపద. భారత్ ఓ దేశం కాదు, ఓ జాతంటూ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు నాకిష్టం’ అని ఆయన అన్నారు. ‘ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తీసుకరాకపోతే నీవు అధికారంలోకి వచ్చినా ఒక్కటే అధికారం కోల్పోయినా ఒక్కటే’ అని అన్నారు. అంతకుముందు డిసెంబర్ 22వ తేదీన పుణెలో జరిగిన జిల్లా పట్టణ కోపరేటివ్ బ్యాంకుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పరాజయాన్ని ఒప్పుకునే సంస్కారం పెరగాలి’ అని అన్నారు. అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘బీజేపీ ఎన్నికలకు ముందు నెరవేర్చడం సాధ్యంకాని హామీలను ఇచ్చింది. రాజకీయాలనేవే తప్పనిసరి ఆడాల్సిన ఓ ఆట. దానికి పరిమితులుంటాయి. వైరుధ్యాలు కూడా ఉంటాయి. మేము ఎప్పటికీ అధికారంలోకి రామని గట్టిగా భావించాం. అయితే అసాధ్యమైన హామీలు ఇవ్వాల్సిందిగా మా వారు మాకు సూచించారు. ఎన్నికయినా వాటిని ఎలాగు నెరవేర్చలేం. అయితే సమస్య ఏమి వచ్చిందంటే, జనం ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. డేట్లతో సహా మేమిచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. చిద్విలాసంగా నవ్వుతూ ముందుకు పోతున్నాం అంతే’ అని వ్యాఖ్యానించారు. గడ్కరీ గతేడాది కాలంగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైనవని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను ఉద్దేశించి చేసినవే ఎక్కువన్న విషయం స్పష్టం అవుతోంది. ‘ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు దేశాన్ని ఏం చక్కదిద్దుతాడు’ అన్న వ్యాఖ్య భార్యను విడిచిపెట్టిన మోదీని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రజల జీవితాలను బాగు చేయలేని వాడు అధికారంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అనడం, అసాధ్యమయ్యే హామీలను ఇవ్వడం (సబ్కే సాత్ సబ్కా వికాస్) తప్పని చెప్పడం, ఎన్నికల్లో ఓడిపోతే అందుకు బాధ్యత వహించాల్సిందనడం మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. ఓటమికి పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అనడం అమిత్ షాను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ఇక కుల, మతాల గురించి, దేశ ప్రజల సహనం గురించి, ఇందిరా, నెహ్రూల గురించి మాట్లాడడం పార్టీ వైఖరిని దూషించినట్లుగా కనిపిస్తోంది. ఇక విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసరం అనడం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు రాజ్ థాక్రే అభ్యంతరం మేరకు ప్రముఖ సాహితీవేత్త నయన్‌తార సహగల్‌ను మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనానికి నిర్వాహకులు ఆహ్వానించకపోవడంపై వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీని పరోక్షంగా విమర్శించడం ద్వారా పార్టీలో తాను ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాలనుకోవడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే మిత్రపక్షాలను ఆకర్షించే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఎదగాలనుకోవడం, ఇక ఇందిరా, నెహ్రూలు, ప్రజల సహనం గురించి మాట్లాడం అంటే తాను మోదీ లాంటి నియంతృత్వ వాదిని కాదని, ప్రజల మనిషినని, నిబద్ధత కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడం కావచ్చు. అయితే ఇలాంటి అన్వయింపులను గడ్కరీ కొట్టి వేస్తున్నారు. మీడియా అసందర్భంగా తన వ్యాఖ్యలకు ఉటంకిస్తోందని ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాలు పడిపోవడానికి పార్టీ నాయకులు నియంతృత్వ పోకడలే కారణమని, ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి గడ్కారీని నియమించాలంటూ ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి సురేశ్ జోషిలకు డిసెంబర్ నెలలో ‘వసంత్‌రావు నాయక్ సేథి స్వావలంబన్ మిషన్’ చైర్పర్సన్ కిషోర్ తివారీ మరి ఎందుకు లేఖ రాశారో? పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కరీకి ఇప్పటికీ ఆరెస్సెస్ అండదండలున్న విషయం తెల్సిందే. -
తర్వాతి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమే!
మదురై: ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తర్వాతి ప్రధాన మంత్రి ఎవరనేది చెప్పడం కొంచెం కష్టమే అని యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. రామేశ్వరంలో జరుగుతున్న భారత్ స్వాభిమాన్ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మంగళవారం మదురై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారని చెప్పడం కష్టమన్నారు. ‘మాకు ఎలాంటి రాజకీయ లేదా మతతత్వ ఎజెండా లేదు. మేము ఆధ్యాత్మిక భారతాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకుంటున్నాం. భారతదేశాన్ని హిందూ దేశంగా లేదా మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు’ అని అన్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకపోతే బీజేపీ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోతుందని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన మూక దాడిపై మాట్లాడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై మాట్లాడుతూ, భారత్‌ను మతపరమైన అసహ న దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని బాబా మండిపడ్డారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుల హత్యల కంటే గో హత్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నసీరుద్దీన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం
భారత్‌లో వారసత్వ పాలన సాధారణమే! ► రాజకీయాల నుంచి వ్యాపారాల వరకు అక్కడ ఇదే తీరు ► వారసత్వం కాదు.. సామర్థ్యమే ముఖ్యం ► మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారు ► కాలిఫోర్నియా వర్సిటీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాషింగ్టన్: భారత్‌ను నడిపిస్తోంది వారసత్వమే నని, రాజకీయాల నుంచి వ్యాపారాల వరకు అక్కడ ఇది సర్వసాధారణమని కాంగ్రెస్ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. అయితే వారసత్వం కంటే వ్యక్తి సామర్థ్యమే అతి ముఖ్య మైన అంశంగా పరిగణించాలని అన్నారు. పార్టీ నిర్ణయిస్తే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ మనసులో మాటను బయటపెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ ఆమోదించాల్సి ఉంటుందన్నారు. రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన మంగళవారం బర్క్లీలోని కాలిఫో ర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ విభజన, విద్వేష రాజకీయాలు చేస్తున్నారని, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఊతమి స్తున్నారని ఆరోపించారు. కశ్మీర్లో ‘పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ’(పీడీపీ)తో పొత్తు పెట్టుకోవ డం బీజేపీ చేసిన పెద్ద వ్యూహాత్మక తప్పిద మన్నారు. కశ్మీరీ యువకులను రాజకీయాల వైపు నడిపించే సాధనంలా పీడీపీ ఉండేదని, బీజేపీతో పొత్తుతో దానికి విఘాతం కలిగి, ఉగ్రవాదానికి దారులు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఫలితంగా ఇప్పుడు చాలామంది పీడీపీ కార్యకర్తలు ఉగ్రవాదం వైపు నడుస్తున్నారని తనకు నిఘావర్గాల అధికారులు చెప్పారని రాహుల్ తెలిపారు. నేనొక్కడినే కాదు... ‘వారసత్వ పాలన విషయంలో కాంగ్రెస్సే కాదు.. భారత్‌లో చాలా రాజకీయ పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది. అఖిలేశ్‌యాదవ్, స్టాలిన్లు వారసులే. అంబానీ సోదరులు, చివరకు అభిషేక్ బచ్చన్ కూడా అదే కోవలోకి వస్తారు.ఇన్ఫోసిస్లోనూ ఇదే కొనసాగుతోంది. భారత్‌లో నడుస్తున్న చరిత్ర ఇది. కనుక నన్ను ఒక్కడినే నిందించడం తగదు. కానీ, కాంగ్రెస్‌లో వారసులు కానివారెందరో ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ వ్యక్తి సమర్థుడా.. కాదా అన్నదే అన్నింటికంటే ముఖ్యం’అని రాహుల్ చెప్పారు. మోదీ మంచి మాటకారి ప్రధాని మోదీ మంచి మాటకారి అని రాహుల్ గాంధీ అన్నారు. తనకన్నా బాగా మాట్లాడతారన్నారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి పథకాలు తనకెంతగానో నచ్చాయన్నారు. ‘నేను ప్రతిపక్ష నాయకుడిని. మోదీ మా ప్రధాని. ఆయనకు కొన్ని నైపుణ్యాలున్నాయి. ఆయన మంచి కమ్యూనికేటర్. నిజం చెప్పాలంటే నాకన్నా బాగా అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలరు. ఓ గుంపులో ఉన్న మూడు, నాలుగు వేర్వేరు బృందాలకు సమాచారాన్ని ఎలా చేరవేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన భావ వ్యక్తీకరణ చతురతతో, సమర్థవంతంగా ఉంటుంది’ అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్‌వే... బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమా లన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవేనని రాహుల్ వెల్లడించారు. అయితే అవి ఇప్పుడు ఫలితాలనివ్వవన్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతానికి భారత్‌లో తూట్లు పడుతున్నాయన్నారు. మోదీ విదేశీ విధానాన్నీ రాహుల్ విమర్శించారు. ఒక్క అమెరికాతోనే కాకుండా ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు అవసరమన్నారు. రాహుల్ విఫల రాజకీయ వారసుడు రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనో విఫల రాజకీయ వారసుడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. కాం గ్రెస్‌లో అహంకారం ఆవహించిందని రాహుల్ చెప్పడం... ‘రాజకీయంగా పెద్ద ఒప్పుకోలు’ అని వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకే వర్తిస్తుందన్నారు. ‘విఫల వారసుడు తన విఫల రాజకీ య ప్రయాణం గురించి చెప్పుకోవడానికి అమెరికాను వేదికగా చేసుకున్నారు. భారతీయులు ఆయన మాటలు వినడంలేదనే ఎక్కడికో వెళ్లి మాట్లాడుతు న్నారు’ అని ఎద్దేవా చేశారు. పార్టీలో అహంకారం ప్రవేశించింది కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలవడం మానేసిం దని రాహుల్ చెప్పుకొచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఇలాంటి సమస్య వస్తుందన్నారు. ‘2004లో పార్టీ ఆవిష్కరించిన విజన్ పదేళ్లకు సరిపోయేటంత ఉత్తమమైనది. కానీ అది 2010–11 వచ్చేసరికి పనిచేయలేదు. 2012 ప్రాంతంలో పార్టీలో ఎక్కడో అహంకారం ప్రవేశించింది. అదే ప్రజలతో ముఖాముఖిని నిలువరించింది’ అని అన్నారు. పార్టీలో కార్యనిర్వాహక పాత్ర ఎప్పుడు పోషిస్తారని అడిగిన ప్రశ్నకు... ‘నేను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నా. అయితే అది పార్టీ నిర్ణయం’ అని రాహుల్ బదులిచ్చారు.