ముంబై: కేందమంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ముందు, తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్ వచ్చినట్టు గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాలు తనకు మద్దుతు ఇస్తామని చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
నితిన్ గడ్కరీ తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మోదీ బదులు ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని, తాము మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షాల నుంచి నాకు ప్రపోజల్స్ వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా అలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, నేను వారి ఆఫర్‌ను తిరిస్కరించాను. మోదీ బదులుగా నేను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అనేది బీజేపీలో చీలిక కోసం ప్రతిపక్షాలు చేసిన ప్లాన్ అని నేను అనుకుంటున్నాను.
మోదీ పాలనలో నేను నా బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నాకు ప్రధాని కావాలనే కోరిక ఏమీ లేదు. ఆ పదవి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కూడా లేదు. మొదట నేను ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిని, బీజేపీ కార్యకర్తను. నాకు మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నాకు ఒక్కటే. నిబద్దత కలిగిన కార్యకర్తగా పనిచేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుత బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు కేంద్రమంత్రి పదవులకు కూడా అనర్హులు అన్నట్టుగా రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తూ సీనియర్లకు బయటకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వయస్సు 74 సంవత్సరాలు కాగా.. ఆయనకు ఈ నియమం వర్తిస్తుందో లేదో తెలియదు. ప్రస్తుతం గడ్కరీ వయసు 67 సంవత్సరాలు కావడంతో గడ్కరీ ప్రధాని స్థానం ఇవ్వాలని పలువురు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు కోరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: మహాలక్ష్మి కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
Comments
Please login to add a commentAdd a comment