పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం | Yes, Ready To Be PM Candidate, Signals Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం

Published Wed, Sep 13 2017 1:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - Sakshi

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం

భారత్‌లో వారసత్వ పాలన సాధారణమే!
► రాజకీయాల నుంచి వ్యాపారాల వరకు అక్కడ ఇదే తీరు
► వారసత్వం కాదు.. సామర్థ్యమే ముఖ్యం
►  మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారు
► కాలిఫోర్నియా వర్సిటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ


వాషింగ్టన్‌: భారత్‌ను నడిపిస్తోంది వారసత్వమే నని, రాజకీయాల నుంచి వ్యాపారాల వరకు అక్కడ ఇది సర్వసాధారణమని కాంగ్రెస్‌ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. అయితే వారసత్వం కంటే వ్యక్తి సామర్థ్యమే అతి ముఖ్య మైన అంశంగా పరిగణించాలని అన్నారు. పార్టీ నిర్ణయిస్తే కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడానికి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ మనసులో మాటను బయటపెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని  పార్టీ ఆమోదించాల్సి ఉంటుందన్నారు. రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన మంగళవారం బర్క్‌లీలోని కాలిఫో ర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ విభజన, విద్వేష రాజకీయాలు చేస్తున్నారని, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఊతమి స్తున్నారని ఆరోపించారు. కశ్మీర్‌లో ‘పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ’(పీడీపీ)తో పొత్తు పెట్టుకోవ డం బీజేపీ చేసిన పెద్ద వ్యూహాత్మక తప్పిద మన్నారు. కశ్మీరీ యువకులను రాజకీయాల వైపు నడిపించే సాధనంలా పీడీపీ ఉండేదని, బీజేపీతో పొత్తుతో దానికి విఘాతం కలిగి, ఉగ్రవాదానికి దారులు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఫలితంగా ఇప్పుడు చాలామంది పీడీపీ కార్యకర్తలు ఉగ్రవాదం వైపు నడుస్తున్నారని తనకు నిఘావర్గాల అధికారులు చెప్పారని రాహుల్‌ తెలిపారు.

నేనొక్కడినే కాదు...
‘వారసత్వ పాలన విషయంలో కాంగ్రెస్సే కాదు.. భారత్‌లో చాలా రాజకీయ పార్టీల పరిస్థితి ఒకేలా ఉంది. అఖిలేశ్‌యాదవ్, స్టాలిన్‌లు వారసులే. అంబానీ సోదరులు, చివరకు అభిషేక్‌ బచ్చన్‌ కూడా అదే కోవలోకి వస్తారు.ఇన్ఫోసిస్‌లోనూ ఇదే కొనసాగుతోంది. భారత్‌లో నడుస్తున్న చరిత్ర ఇది. కనుక నన్ను ఒక్కడినే నిందించడం తగదు. కానీ, కాంగ్రెస్‌లో వారసులు కానివారెందరో ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ వ్యక్తి సమర్థుడా.. కాదా అన్నదే అన్నింటికంటే ముఖ్యం’అని రాహుల్‌ చెప్పారు.

మోదీ మంచి మాటకారి
ప్రధాని మోదీ మంచి మాటకారి అని రాహుల్‌ గాంధీ అన్నారు. తనకన్నా బాగా మాట్లాడతారన్నారు. మేకిన్‌ ఇండియా, స్వచ్ఛ్‌ భారత్‌ వంటి పథకాలు తనకెంతగానో నచ్చాయన్నారు. ‘నేను ప్రతిపక్ష నాయకుడిని. మోదీ మా ప్రధాని. ఆయనకు కొన్ని నైపుణ్యాలున్నాయి. ఆయన మంచి కమ్యూనికేటర్‌. నిజం చెప్పాలంటే నాకన్నా బాగా అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలరు. ఓ గుంపులో ఉన్న మూడు, నాలుగు వేర్వేరు బృందాలకు సమాచారాన్ని ఎలా చేరవేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన భావ వ్యక్తీకరణ చతురతతో, సమర్థవంతంగా ఉంటుంది’ అని రాహుల్‌ పేర్కొన్నారు.  

బీజేపీ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్‌వే...
బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమా లన్నీ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవేనని రాహుల్‌ వెల్లడించారు. అయితే అవి ఇప్పుడు ఫలితాలనివ్వవన్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతానికి భారత్‌లో తూట్లు పడుతున్నాయన్నారు. మోదీ విదేశీ విధానాన్నీ రాహుల్‌ విమర్శించారు. ఒక్క అమెరికాతోనే కాకుండా ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు అవసరమన్నారు.

రాహుల్‌ విఫల రాజకీయ వారసుడు
రాహుల్‌ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఆయనో విఫల రాజకీయ వారసుడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. కాం గ్రెస్‌లో అహంకారం ఆవహించిందని రాహుల్‌ చెప్పడం... ‘రాజకీయంగా పెద్ద ఒప్పుకోలు’ అని వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకే వర్తిస్తుందన్నారు. ‘విఫల వారసుడు తన విఫల రాజకీ య ప్రయాణం గురించి చెప్పుకోవడానికి అమెరికాను వేదికగా చేసుకున్నారు. భారతీయులు ఆయన మాటలు వినడంలేదనే ఎక్కడికో వెళ్లి మాట్లాడుతు న్నారు’ అని ఎద్దేవా చేశారు.

పార్టీలో అహంకారం ప్రవేశించింది
కాంగ్రెస్‌ పార్టీ ప్రజలతో కలవడం మానేసిం దని రాహుల్‌ చెప్పుకొచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఇలాంటి సమస్య వస్తుందన్నారు. ‘2004లో పార్టీ ఆవిష్కరించిన విజన్‌ పదేళ్లకు సరిపోయేటంత ఉత్తమమైనది. కానీ అది 2010–11 వచ్చేసరికి పనిచేయలేదు. 2012 ప్రాంతంలో పార్టీలో ఎక్కడో అహంకారం ప్రవేశించింది. అదే ప్రజలతో ముఖాముఖిని నిలువరించింది’ అని అన్నారు. పార్టీలో కార్యనిర్వాహక పాత్ర ఎప్పుడు పోషిస్తారని అడిగిన ప్రశ్నకు... ‘నేను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నా. అయితే అది పార్టీ నిర్ణయం’ అని రాహుల్‌ బదులిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement