అతిపెద్ద పెన్ను
తిక్క లెక్క
సాధారణంగా పెన్నులు జేబులో ఇమిడిపోయేలా ఉంటాయి. కాస్త పొడవాటి పెన్నులైతే, టేబుల్‌పై పెన్‌స్టాండ్‌లో అలంకారంగా పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక అడుగు పొడవు పెన్ను అయితే, అది చాలా పెద్ద పెన్ను కిందే లెక్క. అయితే, ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని పెన్నులన్నింటినీ తలదన్నే పెన్ను.
దీని పొడవు 5.5 మీటర్లు... అంటే పద్దెనిమిది అడుగుల పైమాటే. బరువైతే ఏకంగా 37.23 కిలోలు. ఆచార్య మాకునూరి శ్రీనివాస కొద్దికాలం కిందట హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఈ పెన్ను గిన్నెస్ రికార్డు సాధించింది.