కీచైన్‌కు వేలాడుతూ వేలెడంత కనిపించే ఈ పెన్ను మన్నిక తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. నానో ఇంకుతో పనిచేసే ఈ పెన్ను వంద పెన్సిళ్ల మన్నిక కంటే ఎక్కువే! టిటానియమ్‌తో రూపొందించిన ఈ పెన్నులో ఒక నానో ఇంకు కాట్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక జీవితకాలం మన్నుతుంది. దీనికి రీఫిల్ వేసుకోవడం, ఇంకు నింపుకోవడం, కాట్రిడ్జ్ మార్చుకోవడం వంటి అవసరమే ఉండదు. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్యాప్ పెన్ను మొనను సురక్షితంగా ఉంచుతుంది.
‘ఇన్నోజూమ్’ అనే అమెరికన్ స్టార్టప్ సంస్థ క్రౌడ్‌ఫండింగ్ ద్వారా దీని రూపకల్పనకు నడుం బిగించింది. కనీస స్థాయిలో ఈ నానో ఇంకు పెన్నును మార్కెట్‌లోకి విడుదల చేయాలంటే 20 వేల డాలర్లు (రూ.16.67 లక్షలు) అవసరమవుతాయని ఈ సంస్థ ప్రకటించింది.
ఇప్పటి వరకు మూడువేల డాలర్లు (రూ.2.50 లక్షలు) మాత్రమే పోగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఎంత త్వరగా పూర్తి డబ్బు సమకూరితే, అంత త్వరగా ఈ పెన్ను మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ఈ పెన్ను ధర డిజైన్, నాణ్యతను బట్టి 29 నుంచి 99 డాలర్ల వరకు (రూ. 2,418 నుంచి రూ.8,255) ఉండవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment