titanium
-
'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!
ఆధునాతన వైద్య విధానం కొంత పుంతలు తొక్కుతోంది. దీనికి తోడు ఏఐ సాంకేతికత ఆరోగ్య నిర్వహణను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా మార్చింది. అందుకు ఉదహారణ ఈ రియల్ ఐరన్ మ్యాన్. ఎంతలా వైద్య విధానం అభివృద్ధి చెందుతున్నా.. అవయవమార్పిడి విషయంలో దాతల కొరత వైద్యులను వేదిస్తున్న ప్రధాన సమస్య. దీన్ని నివారించేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఐతే కొన్ని ప్రధాన అవయవాలైన గుండె, మూత్రపిండాలు వంటి వాటిల్లో కృత్రిమ అవయవాలు ఎంత వరకు పనిచేస్తాయనేది ధర్మసందేహంగా ఉండేది. అది ఈ వ్యక్తికి విజయవంతంగా అమర్చిన కృత్రిమ గుండెతో వైద్యుల మదిలో మెదిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా చేసింది. కొత్త ఆశలను రేకెత్తించింది. నిజ జీవిత ఐరన్ మ్యాన్‌గా పిలిచే ఆ వక్తి కథ ఏంటో చూద్దామా..!అమెరికాకు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాడు. అయితే గుండె ఇచ్చే దాతలు అందుబాటులో లేకపోవడంతో టైటానియంతో తయారు చేసిన గుండెను అమర్చారు వైద్యులు. ప్రపంచంలోనే ఇలా కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి అతడే. అంతేగాదు ప్రస్తుతం అతడిని రియల్ ఐరన్ మ్యాన్‌గా పిలుచుకుంటున్నారు అంతా. ఇది ఒకరకంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు ఉదహారణగా నిలచింది. ఇది పల్లాడియంతో నడిచే ఆర్క్ రియాక్టర్ మార్వెల్‌తో పనిచేస్తుంది. ఇది విఫలమైన మానవ గుండె పనితీరును పూర్తిగా భర్తీ చేయడానికి రూపొందించిన టైటానియం బ్లడ్-పంపర్. దీన్ని బైవేకర్ అనే వైద్య సంస్థ అభివృద్ధి చేసంది. ఇది టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్(టీఏహెచ్) అని అంటారు. ఇది అచ్చం మానవ గుండె మాదిరిగా డిజైన్ చేశారు. అయితే సహజ హృదయస్పందనను అనుకరించదు. బదులుగా ఊపిరితిత్తులకు, శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి అయస్కాంతంగా లెవిటేటింగ్ రోటర్‌ను ఉపయోగిస్తుంది. ఈ వినూత్న డిజైన్ సౌకర్యవంతమైన గదులు లేదా పంపింగ్ డయాఫ్రాగమ్ల అవసరాన్ని తొలగిస్తుంది. చెప్పాలంటే ఇది మన్నికైన మరియు కాంపాక్ట్ పరికరంగా పేర్కొనవచ్చు.ఈ కృత్రిమ హార్ట్ ఇంప్లాంటేషన్ టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని బేలర్ సెయింట్ లూక్స్ మెడికల్ సెంటర్లో జరిగింది. ఈ మేరకు సదరు వైద్యులు మాట్లాడుతూ.."బాధితుడికి దాత అందుబాటులోకి వచ్చేవరకు ఈ కృత్రిమ గుండె ఎనిమిది రోజుల పాటు సమర్థవంతంగా పనిచేసింది. అంతేగాదు ఎన్నోఏళ్లుగా ఈ విషయమై సాగుతున్న పరిశోధనకు ఈ ఇంప్లాంటేషన్ సర్జరీ ముగింపు పలికింది. సదరు రోగి కుటుంబ సహకారం వల్ల ఇదంతా సాధ్యమయ్యింది.దీని కాంపాక్ట్ సైజు, ఇంచుమించు పిడికిలిలా ఉంటుంది. ఇది పురుషులు, స్త్రీలతో సహా అనేక రకాల రోగులకు అనుకూలంగా ఉంటుంది. ఏటా గుండె మార్పిడి డిమాండ్ అధికంగా ఉంది. దాతలు అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమస్యకు ఈ కృత్రిమ గుండె చెక్‌పెట్టి..ఆయా బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషస్తుంది. అంతేగాదు ఇది తీవ్రమైన గుండె వైఫల్య చికిత్సలో కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుంది." అని అన్నారు. (చదవండి: గంజాయితో లాభాలు! పరిశోధనలో షాకింగ్ విషయాలు..!) -
టెక్నాలజీ తోడై..!, పెన్ను వేలెడు.. రాత బారెడు
కీచైన్‌కు వేలాడుతూ వేలెడంత కనిపించే ఈ పెన్ను మన్నిక తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. నానో ఇంకుతో పనిచేసే ఈ పెన్ను వంద పెన్సిళ్ల మన్నిక కంటే ఎక్కువే! టిటానియమ్తో రూపొందించిన ఈ పెన్నులో ఒక నానో ఇంకు కాట్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక జీవితకాలం మన్నుతుంది. దీనికి రీఫిల్ వేసుకోవడం, ఇంకు నింపుకోవడం, కాట్రిడ్జ్ మార్చుకోవడం వంటి అవసరమే ఉండదు. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్యాప్ పెన్ను మొనను సురక్షితంగా ఉంచుతుంది. ‘ఇన్నోజూమ్’ అనే అమెరికన్ స్టార్టప్ సంస్థ క్రౌడ్‌ఫండింగ్ ద్వారా దీని రూపకల్పనకు నడుం బిగించింది. కనీస స్థాయిలో ఈ నానో ఇంకు పెన్నును మార్కెట్లోకి విడుదల చేయాలంటే 20 వేల డాలర్లు (రూ.16.67 లక్షలు) అవసరమవుతాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు మూడువేల డాలర్లు (రూ.2.50 లక్షలు) మాత్రమే పోగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఎంత త్వరగా పూర్తి డబ్బు సమకూరితే, అంత త్వరగా ఈ పెన్ను మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ పెన్ను ధర డిజైన్, నాణ్యతను బట్టి 29 నుంచి 99 డాలర్ల వరకు (రూ. 2,418 నుంచి రూ.8,255) ఉండవచ్చని అంచనా. -
భారత్‌లో టైటానియం వరల్డ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న మలేషియా కంపెనీ టైటానియం వరల్డ్ టెక్నాలజీ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. అనుబంధ కంపెనీ అయిన స్మార్ట్‌కోట్ ఇండియా ద్వారా సూక్ష్మజీవులను హరించే రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. సంస్థగత, పారిశ్రామిక వినియోగం కోసం స్మార్ట్‌కోట్ నానో, వ్యక్తిగత వినియోగం కోసం ఆర్మోర్–8 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌కోట్ నానో స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం ఏడాది పాటు ఉంటుందని స్మార్ట్‌కోట్ ఇండియా ఎండీ రామకృష్ణ కడియం గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. చదరపు అడుగుకు రూ.170 చార్జీ చేస్తామన్నారు. ఆర్మోర్–8 స్ప్రే నెల రోజులపాటు పనిచేస్తుంది. ధర 60 ఎంఎల్ రూ.399, 250 ఎంఎల్ రూ.1,499గా నిర్ణయించామన్నారు. అత్యాధునిక నానో కోటింగ్ టెక్నాలజీతో ఇది రూపొందాయని వివరించారు. ఉత్పత్తులకు ప్రతిష్టాత్మక సీఈ ధ్రువీకరణ ఉంది. -
ఆ గ్రహంపై టైటానియం వర్షం..
భూమికి 1,700 కాంతి సంవత్సరాల దూరంలో ఓ కొత్త గ్రహాన్ని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో గొప్ప విశేషం ఏమీ లేకపోవచ్చుగానీ.. ఈ గ్రహంపై టైటానియం యాక్సైడ్ రసాయనం మంచు మాదిరిగా జాలు వారుతూ ఉంటుందన్న సమాచారం మాత్రం ఆసక్తికరమే. భూమ్మీద ఈ రసాయనాన్ని సన్‌స్క్రీన్ క్రీముల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. తెలిసిన ఎక్సోప్లానెట్లు అన్నింటిలో అత్యంత అధిక ఉష్ణోగ్రత కలిగిన కెప్లర్ 13ఏబీపై తాము పరిశోధనలు చేశామని.. నక్షత్రానికి అతి దగ్గరగా ఉన్న ఈ గ్రహం ఒకభాగం ఎప్పుడూ చీకట్లోనే ఉంటుందని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త థామస్ బెటీ వివరించారు. మంచు రూపంలో టైటానియం యాక్సైడ్ కురిసేది కూడా ఈ చీకటి ప్రాంతంలోనేనని తెలిపారు. నక్షత్రానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 5,000 డిగ్రీ ఫారెన్‌హీట్ వరకు ఉంటాయని బెటీ వెల్లడించారు. -
షావోమికి ఝలక్.. టైటానియం జంబో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. టైటానియం సిరీస్ కొనసాగింపుగా ‘కార్బన్ టైటానియం జంబో’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ఎంఆర్పీ ధర రూ.7,490 కాగా, మార్కెట్ ఆపరేటింగ్ ధర కింద రూ.6,490కే అందించనున్నట్టు కార్బన్ ప్రకటించింది. అలాగే ఫోన్‌తో పాటు ప్యానల్ కవర్‌ను కూడా ఉచితంగా సంస్థ అందిస్తోంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి తమ తాజా ఫోన్ ప్రత్యేకత అనీ స్టాండ్‌బై మోడ్‌లో 400 గంటల టాక్‌టైమ్, 16గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో స్పీడ్ , కెమెరా, ధరతో పోల్చుకుంటే.. ఈ డ్యుయల్ సిమ్ టైటానియం జంబో..షావోమి రెడ్మి 4 మొబైల్‌కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టైటానియం జంబో ఫీచర్లు 5 అంగుళాల స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ ఫోటోలు సౌర శక్తి ఫలకాలు
సౌరశక్తి విసృ్తత వినియోగానికి ఉన్న ఒక అడ్డంకి సౌరశక్తి ఫలకాలసైజు.వీటిని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకుడమూ సాధ్యం కాదు. పైగా ఖర్చూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేశామంటోంది ఆల్టో యూనివర్శిటీ. ఫొటోలో కనిపిస్తున్నవి.. మామూలు ఫొటోలు మాత్రమే కాదు.. సాధారణ ఇంక్జెట్ ప్రింటర్‌తో ముద్రించుకోగల సౌరశక్తి ఫలకాలు కూడా. డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్ పేరుతో ఇలాంటివి ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నా ఆల్టో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన వాటి సామర్థ్యం ఎక్కువ. పైగా వీటిని ఫొటోలుగా, లేదంటే అక్షరాలుగా కూడా ముద్రించుకుని సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యేకమైన ఇంకును టైటానియం పొరపై ముద్రించడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ రకమైన సౌరశక్తి ఫలకాలకు అడ్వర్టయిజ్మెంట్ హోర్డింగ్‌లపై వాడితే అటు ప్రచారంతోపాటు ఇటు కరెంటూ ఉత్పత్తి చేయవచ్చునన్నమాట. దాదాపు వెయ్యిగంటలపాటు ఏకబిగిన పనిచేయించినా వీటి సామర్థ్యం 6.4 శాతం వరకూ కొనసాగిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఘుఫ్రాన్ హష్మీ తెలిపారు. -
కిందకు చూస్తే కళ్లు తిరగడం ఖాయం
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్వత శిఖరాగ్రాలపై వినూత్న కట్టడాలను నిర్మించడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. బీజింగ్ నగరానికి కేవలం 43 మైళ్ల దూరంలో వున్న జింగ్‌డాంగ్ స్టోన్ ఫారెస్ట్ వద్ద 1300 అడుగుల అతిపెద్ద లోయను పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించడం కోసం వృత్తాకారంలో 4,467 చదరపు అడుగుల విస్తీర్ణంగల గ్లాస్ ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పొడవైనఈ నిర్మాణాన్ని పర్యాటకుల వీక్షణ కోసం గతవారమే ప్రారంభించింది. పర్వత శిఖరాగ్రానికి ఏటవాలుగా 107 అడుగుల దూరంలో ఏర్పాటుచేసిన ఈ గ్లాస్ ప్లాట్‌ఫామ్ అమెరికాలోని గ్రాండ్ కాన్యన్లో ఉన్న 37 అడుగుల గ్యాస్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్కన్నా పెద్దది. ఈ సరికొత్త గ్లాస్ ప్లాట్‌ఫామ్ మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది. ఇది ప్రపంచంలో అతిపెద్దదే కాకుండా అతి పొడవైన గ్లాస్ ప్లాట్‌ఫామ్. అంతేకాకుండా విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టైటానియంతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. టైటానియం ఎంతో తేలికగా ఉండడంతోపాటు ఎంతో మన్నికైంది. పర్యాటకుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, అందుకనే టైటానియంను ఉపయోగించామని చైనా అధికారులు తెలిపారు. గత ఆదివారం దీన్ని ప్రారంభించినప్పుడు తొలి సందర్శకులు దీనిపైకి వెళ్లేందుకు ఎంతో భయపడ్డారని, ఆ తర్వాత ఎంతో థ్రిల్ ఫీలయ్యారని వారు చెప్పారు. -
మృత్యువును జయించిన టైటానియమ్ తారక
లోహసుందరి వేమౌత్ (ఇంగ్లండ్) రోడ్ల మీద వయసుకి తగ్గ వేగంతో దూసుకుపోతోంది 17 ఏళ్ల కత్రినా బర్గెస్. మనసులో తన మోడలింగ్ కలలు నెరవేరబోతున్నాయన్న ఊహలు వేగంగా పరుగులు తీస్తుంటే వాటికి పోటీగా కారుని ఉరకలెత్తిస్తోంది కత్రినా. పార్టీకి టైమ్ అవుతోంది. యాక్సిలరేటర్‌ని గట్టిగా దబాయించింది. క్షణం గడవగానే ఏదో చెట్టు నడుచుకుంటూ తన కార్ వైపు వస్తున్నట్లు అనిపిచింది. ‘ఏమౌతుంది..’ అనే ఆలోచన కళ్లలోకి ప్రవేశిస్తుండగానే ఆ కారు వెళ్లి ఆ చెట్టుని గుద్దింది. కారు చిధ్రం అయిపోయింది. ఎవరో వచ్చి తనని స్ట్రెచర్ మీద తీసుకెళుతున్నట్టు లీలగా తెలుస్తోంది కత్రినాకు. శ్వాస పీలుస్తోంది కానీ వాసన తెలియడం లేదు. నాలుక రుచులు మర్చిపోయినట్టుగా ఉంది. మెల్లగా కళ్లు తెరిచి చూసింది కత్రినా. ‘ఏమైంది నాకు’ అని అడగటానికి ప్రయత్నం చేసినా మాట రావట్లేదు. తన నుండి ఏవో తీస్తున్నారు, వేస్తున్నారు డాక్టర్లు. ‘ఏమీ కాదు’ అన్నట్టు నవ్వింది అక్కడ ఉన్న ఒక డాక్టరు. మెల్లగా కారు, చెట్టు, యాక్సిడెంట్ గుర్తుకొచ్చాయి. నుదురు చిట్లించింది. తను ఎలా ఉందో చూసుకోవాలి. లేచేందుకు ఓపిక కూడా లేదు. తల కూడా లేపలేకపోయింది. కాస్త కష్టపడి తల తిప్పగా, తన బెడ్ పక్కన ఉన్న బెడ్ ప్యాన్‌లో తన ప్రతిరూపం కనిపించింది. మనిషిలా లేదు. మనిషి శరీరానికి ఉండాల్సిన నిర్మాణం చెల్లాచెదురైంది. ఎముకలు కూలి కొత్త ఆకారంలో ఉన్న తనని తాను చూసుకుని ఆరిచే ప్రయత్నం చేసింది. ఆ యాక్సిడెంట్లో తన వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. రెండు ఊపిరితిత్తులు చిల్లులు పడ్డాయి. మెడ ఎముక, తుంటి ఎముకతో పాటు ఎడమకాలు ఎముక కూడా విరిగిపోయింది. తన ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధమైంది కత్రినా. తన శరీరంలో విరిగిపోయిన ఎముకల్ని టైటానియమ్ రాడ్లతో రీప్లేస్ చేయడానికి సిద్ధపడ్డారు డాక్టర్లు. తన నడుము గుండా తన ఎడమ కాలిలో విరిగిన తొడ ఎముక స్థానంలో రాడ్‌ని అమర్చారు. తరువాత వారం, ఆరు టైటానియమ్ పిన్‌లను కలిిపి తన విరిగిన వెన్నెముక స్థానంలో పెట్టారు. మెడ స్థానంలో ఆ టైటానియమ్ పిన్ల గుండా ఒక టైటానియమ్ స్క్రూని పెట్టారు. 5 నెలల తరువాత తను లేచి నిలబడగలిగింది. ‘‘లేచి చిలుచున్నప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మెడలో స్క్రూ ఉండడం విచిత్రంగా అనిపించింది’’ అని తన మనసులో భావనని డాక్టర్లకు చెప్పింది కత్రినా. యాక్సిడెంట్ అయిన తరువాత అమీబాలా రూపం పొగొట్టుకున్న కత్రినా ని తిరిగి అందంగా మార్చారు డాక్టర్లు. యాక్సిడెంట్ అయిన 5 నెలల తరువాత డాక్టర్ల చలవతో తిరిగి తన కెరీర్‌ను ఆరంభించడానికి సిద్ధపడింది కత్రినా. పదకొండు టైటానియం రాడ్లను ఒంట్లో దాచుకుని బయటకు నడిచింది తను తన కలల వైపు. - జాయ్