భూమికి 1,700 కాంతి సంవత్సరాల దూరంలో ఓ కొత్త గ్రహాన్ని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో గొప్ప విశేషం ఏమీ లేకపోవచ్చుగానీ.. ఈ గ్రహంపై టైటానియం యాక్సైడ్ రసాయనం మంచు మాదిరిగా జాలు వారుతూ ఉంటుందన్న సమాచారం మాత్రం ఆసక్తికరమే. భూమ్మీద ఈ రసాయనాన్ని సన్‌స్క్రీన్ క్రీముల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు.
తెలిసిన ఎక్సోప్లానెట్లు అన్నింటిలో అత్యంత అధిక ఉష్ణోగ్రత కలిగిన కెప్లర్ 13ఏబీపై తాము పరిశోధనలు చేశామని.. నక్షత్రానికి అతి దగ్గరగా ఉన్న ఈ గ్రహం ఒకభాగం ఎప్పుడూ చీకట్లోనే ఉంటుందని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త థామస్ బెటీ వివరించారు. మంచు రూపంలో టైటానియం యాక్సైడ్ కురిసేది కూడా ఈ చీకటి ప్రాంతంలోనేనని తెలిపారు. నక్షత్రానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 5,000 డిగ్రీ ఫారెన్‌హీట్ వరకు ఉంటాయని బెటీ వెల్లడించారు.
ఆ గ్రహంపై టైటానియం వర్షం..
Published Sat, Oct 28 2017 3:32 AM | Last Updated on Sat, Oct 28 2017 3:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment