ఈ ఫోటోలు సౌర శక్తి ఫలకాలు | These photos are solar energy panels | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలు సౌర శక్తి ఫలకాలు

Published Wed, Jul 27 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

These photos are solar energy panels

 సౌరశక్తి విసృ్తత వినియోగానికి ఉన్న ఒక అడ్డంకి సౌరశక్తి ఫలకాలసైజు.వీటిని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకుడమూ సాధ్యం కాదు. పైగా ఖర్చూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేశామంటోంది ఆల్టో యూనివర్శిటీ. ఫొటోలో కనిపిస్తున్నవి.. మామూలు ఫొటోలు మాత్రమే కాదు.. సాధారణ ఇంక్‌జెట్ ప్రింటర్‌తో ముద్రించుకోగల సౌరశక్తి ఫలకాలు కూడా. డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్ పేరుతో ఇలాంటివి ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నా ఆల్టో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన వాటి సామర్థ్యం ఎక్కువ.

 

పైగా వీటిని ఫొటోలుగా, లేదంటే అక్షరాలుగా కూడా ముద్రించుకుని సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యేకమైన ఇంకును టైటానియం పొరపై ముద్రించడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ రకమైన సౌరశక్తి ఫలకాలకు అడ్వర్టయిజ్‌మెంట్ హోర్డింగ్‌లపై వాడితే అటు ప్రచారంతోపాటు ఇటు కరెంటూ ఉత్పత్తి చేయవచ్చునన్నమాట. దాదాపు వెయ్యిగంటలపాటు ఏకబిగిన పనిచేయించినా వీటి సామర్థ్యం 6.4 శాతం వరకూ కొనసాగిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఘుఫ్రాన్ హష్మీ తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement