
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న మలేషియా కంపెనీ టైటానియం వరల్డ్ టెక్నాలజీ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. అనుబంధ కంపెనీ అయిన స్మార్ట్‌కోట్ ఇండియా ద్వారా సూక్ష్మజీవులను హరించే రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. సంస్థగత, పారిశ్రామిక వినియోగం కోసం స్మార్ట్‌కోట్ నానో, వ్యక్తిగత వినియోగం కోసం ఆర్మోర్–8 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది.
స్మార్ట్‌కోట్ నానో స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం ఏడాది పాటు ఉంటుందని స్మార్ట్‌కోట్ ఇండియా ఎండీ రామకృష్ణ కడియం గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. చదరపు అడుగుకు రూ.170 చార్జీ చేస్తామన్నారు. ఆర్మోర్–8 స్ప్రే నెల రోజులపాటు పనిచేస్తుంది. ధర 60 ఎంఎల్ రూ.399, 250 ఎంఎల్ రూ.1,499గా నిర్ణయించామన్నారు. అత్యాధునిక నానో కోటింగ్ టెక్నాలజీతో ఇది రూపొందాయని వివరించారు. ఉత్పత్తులకు ప్రతిష్టాత్మక సీఈ ధ్రువీకరణ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment