ఆధునాతన వైద్య విధానం కొంత పుంతలు తొక్కుతోంది. దీనికి తోడు ఏఐ సాంకేతికత ఆరోగ్య నిర్వహణను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా మార్చింది. అందుకు ఉదహారణ ఈ రియల్ ఐరన్ మ్యాన్. ఎంతలా వైద్య విధానం అభివృద్ధి చెందుతున్నా.. అవయవమార్పిడి విషయంలో దాతల కొరత వైద్యులను వేదిస్తున్న ప్రధాన సమస్య. దీన్ని నివారించేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఐతే కొన్ని ప్రధాన అవయవాలైన గుండె, మూత్రపిండాలు వంటి వాటిల్లో కృత్రిమ అవయవాలు ఎంత వరకు పనిచేస్తాయనేది ధర్మసందేహంగా ఉండేది. అది ఈ వ్యక్తికి విజయవంతంగా అమర్చిన కృత్రిమ గుండెతో వైద్యుల మదిలో మెదిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా చేసింది. కొత్త ఆశలను రేకెత్తించింది. నిజ జీవిత ఐరన్ మ్యాన్‌గా పిలిచే ఆ వక్తి కథ ఏంటో చూద్దామా..!
అమెరికాకు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాడు. అయితే గుండె ఇచ్చే దాతలు అందుబాటులో లేకపోవడంతో టైటానియంతో తయారు చేసిన గుండెను అమర్చారు వైద్యులు. ప్రపంచంలోనే ఇలా కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి అతడే. అంతేగాదు ప్రస్తుతం అతడిని రియల్ ఐరన్ మ్యాన్‌గా పిలుచుకుంటున్నారు అంతా. ఇది ఒకరకంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు ఉదహారణగా నిలచింది.
ఇది పల్లాడియంతో నడిచే ఆర్క్ రియాక్టర్ మార్వెల్‌తో పనిచేస్తుంది. ఇది విఫలమైన మానవ గుండె పనితీరును పూర్తిగా భర్తీ చేయడానికి రూపొందించిన టైటానియం బ్లడ్-పంపర్. దీన్ని బైవేకర్ అనే వైద్య సంస్థ అభివృద్ధి చేసంది. ఇది టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్(టీఏహెచ్) అని అంటారు. ఇది అచ్చం మానవ గుండె మాదిరిగా డిజైన్ చేశారు. అయితే సహజ హృదయస్పందనను అనుకరించదు. బదులుగా ఊపిరితిత్తులకు, శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి అయస్కాంతంగా లెవిటేటింగ్ రోటర్‌ను ఉపయోగిస్తుంది. ఈ వినూత్న డిజైన్ సౌకర్యవంతమైన గదులు లేదా పంపింగ్ డయాఫ్రాగమ్‌ల అవసరాన్ని తొలగిస్తుంది. చెప్పాలంటే ఇది మన్నికైన మరియు కాంపాక్ట్ పరికరంగా పేర్కొనవచ్చు.
ఈ కృత్రిమ హార్ట్ ఇంప్లాంటేషన్ టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోని బేలర్ సెయింట్ లూక్స్ మెడికల్ సెంటర్‌లో జరిగింది. ఈ మేరకు సదరు వైద్యులు మాట్లాడుతూ.."బాధితుడికి దాత అందుబాటులోకి వచ్చేవరకు ఈ కృత్రిమ గుండె ఎనిమిది రోజుల పాటు సమర్థవంతంగా పనిచేసింది. అంతేగాదు ఎన్నోఏళ్లుగా ఈ విషయమై సాగుతున్న పరిశోధనకు ఈ ఇంప్లాంటేషన్ సర్జరీ ముగింపు పలికింది. సదరు రోగి కుటుంబ సహకారం వల్ల ఇదంతా సాధ్యమయ్యింది.
దీని కాంపాక్ట్ సైజు, ఇంచుమించు పిడికిలిలా ఉంటుంది. ఇది పురుషులు, స్త్రీలతో సహా అనేక రకాల రోగులకు అనుకూలంగా ఉంటుంది. ఏటా గుండె మార్పిడి డిమాండ్ అధికంగా ఉంది. దాతలు అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమస్యకు ఈ కృత్రిమ గుండె చెక్‌పెట్టి..ఆయా బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషస్తుంది. అంతేగాదు ఇది తీవ్రమైన గుండె వైఫల్య చికిత్సలో కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుంది." అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment