
‘పలాస’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట గుర్తుంది కదా! ఇది సినిమాలోని స్పెషల్ సాంగ్. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా నాదీ నక్కిలీసు గొలుసు అంటున్నారు. అయితే ఇది పాట కాదు. ఎంతో ప్రేమగా భర్త డేనియల్ వెబర్ కానుకగా ఇచ్చిన వజ్రాల నెక్లెస్ గురించి చెబుతున్నారు. ఈ ఇద్దరికీ పెళ్లయి, పదేళ్లయింది. ‘‘నన్ను వజ్రాల నెక్లెస్‌తో అలంకరించినందుకు థ్యాంక్స్. పదమూడేళ్ళ అనుబంధంలో పదేళ్ల వివాహ జీవితం మనది(భర్తని ఉద్దేశించి).
మన జీవన ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుందని ఒకరికొకరం చేసుకున్న ఒక్క ప్రామిస్ వల్ల ఈ రోజు మనం ఈ మనోహరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సన్నీలియోన్. ప్రస్తుతం మలయాళంలో ‘షీరో’ చిత్రంతో పాటు ఓ టీవీ షోతో సన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు డేనియల్ వెబర్, సన్నీ. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలకు వారు తల్లితండ్రులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment