
గ్యారెంటీ అన్‌లిమిటెడ్..
మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు గ్యారెంటీ వంటివి చూసి కొంటాం.. అయినా ఎవరైనా ఎంత కాలం గ్యారెంటీ ఇస్తారు. ఇస్తే..గిస్తే.. జీవిత కాలం గ్యారెంటీ అంటారు.
మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు గ్యారెంటీ వంటివి చూసి కొంటాం.. అయినా ఎవరైనా ఎంత కాలం గ్యారెంటీ ఇస్తారు. ఇస్తే..గిస్తే.. జీవిత కాలం గ్యారెంటీ అంటారు. అయితే.. చిత్రంలోని హ్యాండ్ బ్యాగ్ గానీ మీరు కొంటే.. వెయ్యేళ్ల గ్యారెంటీ ఇస్తానని దీన్ని తయారుచేసిన డిజైనర్ క్రిస్టొఫర్ షెల్లీస్ చెబుతున్నారు. వెయ్యేళ్ల వరకూ ఇది చిరగడం గానీ.. విరగడం గానీ జరగదని బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్ ధీమాగా చెబుతున్నారు. అంటే తరతరాలు వాడేసుకోవచ్చన్నమాట. గ్యారెంటీ సూపర్.. ధర ఎంతనేగా మీ డౌట్.. ధర కూడా సూపర్‌డూపరే.. కేవలం రూ.1.09 కోట్లు!! ఎందుకంటే.. ఇందులో 345 వజ్రాలు పొదిగి ఉన్నాయి. 18 క్యారెట్ల బంగారంతో దీన్ని తయారుచేశారు. 7 అంగుళాల వెడల్పు, 5 అంగుళాల పొడవు ఉన్న ఈ బుల్లి బ్యాగ్ డిజైన్‌ను బకింగ్‌హాం ప్యాలెస్ గేట్లను చూసి రూపొందించార ట.