ఆ గ్రహాలు వజ్రాల కొండలు!
వాషింగ్టన్: గురు, శనిగ్రహాలపై వజ్రాలు సమృద్ధిగా ఉన్నాయని, వాటి అంతర్భాగంలో ఏకంగా వజ్రాల కొండలే ఉండవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహాలపై ద్రవ హైడ్రోజన్, ద్రవ హీలియం ప్రవాహాల్లో వజ్రాల తునకలు కూడా ప్రవహిస్తుండవచ్చని వారు చెబుతున్నారు. గురు, శని గ్రహాలపై పీడనం-ఉష్ణోగ్రతకు సంబంధించిన స్థిరోష్ణ ప్రక్రియపై జరిపిన పరిశోధనలో వెల్లడైన వివరాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు కాలిఫోర్నియా స్పెషాలిటీ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో గురు, శని గ్రహాలపై అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల వజ్రాలు గట్టిపడేందుకు అవకాశాలు లేవని భావించారు.