అక్షయ తృతీయ : బంగారంపై భారీ డిస్కౌంట్లు
అక్షయ తృతీయ : బంగారంపై భారీ డిస్కౌంట్లు
Published Fri, Apr 28 2017 3:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM
అక్షయ తృతీయ సెలబ్రేషన్స్... హిందూ పురాణాల ప్రకారం ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొంటే అదృష్టదేవత వెన్నంటే ఉండి, విజయ బాటలో నడిపిస్తుందని నమ్మకం. పెట్టుబడుల కోసం బంగారం కొంటే, మంచి ఫలితాలనిస్తాయని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. దీంతో అక్షయ తృతీయ రోజున సాధారణ రోజులంటే ఎక్కువగానే బంగారం కొనుగోళ్లు జరుపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు సైతం డిస్కౌంట్ ఆఫర్ల వెల్లువతో మారు మోగిస్తుంటాయి. ఈ సారి బంగారం దుకాణాలతో పాటు ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. బంగారం, ప్లాటినం, డైమాండ్ జువెల్లరీలపై డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి.
ముంబాయికి చెందిన వర్క్యూవల్ మార్కెట్ ప్లేస్ ఏకంగా ట్రూబిల్ డైరెక్ట్ నుంచి కారు బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కేవలం అక్షయ తృతీయ రోజేనని ప్రకటించింది. తమ ప్లాట్ పామ్ పై గోల్డ్ రింగ్, నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఈయరింగ్ వంటి బంగార ఆభరణాలను కొనుగోలు చేస్తే 70 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కైతే అదనంగా 5 శాతం తగ్గిస్తామని తెలిపింది.
సెన్కో గోల్డ్, జోయల్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టీబీజడ్-ది ఒరిజినల్ వంటి బ్రాండులను కలిగి ఉన్నఅ అమెజాన్ సంస్థ, జువెల్లరీ కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ , డెబిట్ కార్డు దారులకు 5-20 శాతం తగ్గింపును ప్రకటించింది. నేటి వరకే ఈ ఆఫర్ ఉండబోతున్నట్టు తెలిపింది. ఒర్రా సైతం తన ఆన్ లైన్ పోర్టలో బంగారం కాయిన్లకు, బార్స్ కు అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి మేకింగ్ ఛార్జీలు వేయమని తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ అందుబాటులో ఉంచనుందట. ఏకంగా పేటీఎం డిజిటల్ వ్యాలెట్ అయితే ఒక్క రూపాయికే బంగారాన్ని విక్రయించనున్నట్టు వెల్లడించింది.
అక్షయ తృతీయ సందర్భంగా ప్లెయిన్ గోల్డ్ జువెలరీపై 25 శాతం వరకు మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నట్టు తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్, మార్కెటింగ్) సందీప్ కుల్హాలి తెలిపారు. డైమండ్ జువెలరీ విలువపై 25 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఆఫర్లకు ఇప్పటికే కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కూడా ఎస్బీఐ డెబిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం గుర్గావ్, ఢిల్లీ స్టోర్లకు మాత్రమేనని తెలిపింది. తమ ఆన్ లైన్ పోర్టల్ లో బంగారం జువెల్లరీ మేకింగ్ ఛార్జీలపై 30 శాతం, డైమండ్ విలువపై 15 శాతం తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారంలోగా అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకున్న ఆభరణాలపై వెండిని ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.
Advertisement
Advertisement