సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): ఓ వైపు వివాహం కావట్లేదు... మరో వైపు చేతిలో చిల్లిగవ్వ లేని ఆర్థిక ఇబ్బందులు.. వీటిని భరించలేక ఓ యువకుడు పనిచేసే చోటే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్‌ఐ కొండపల్లి నాగరాజు సమాచారం మేరకు... ఏపీలోని వైఎస్సార్‌కడప పట్టణానికి చెందిన చక్కటి నర్సింహులు కొంతకాలంగా ఉప్పల్ ప్రాంతంలో తల్లి ఓబులమ్మ, అన్నతో కలసి నివసిస్తున్నాడు.
హిమాయత్‌నగర్‌లోని శ్రీబాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి వీరికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోగా.. వీరిని పట్టించుకోకపోవంతో తీవ్రమైన అప్పులు ఏర్పడ్డాయి. నర్సింహులు అన్నకు కూడా వివాహం కాలేదు. కొద్దిరోజులుగా నర్సింహులుకు వివాహ సంబంధాలు చూస్తున్నా ఏవీ సెట్ కావడం లేదు. దీంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
అప్పులు సైతం తీర్చలేని పరిస్థితి నెలకొంది. తన బాధలను తల్లికి, అన్నకు చెప్పుకోలేక తాను పనిచేస్తున్న చోటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం డ్యూటీకి వచ్చిన వారు రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నర్సింహులు విగతజీవిగా ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
చదవండి: కాల్పులు జరిపింది ఆ ముగ్గురే!
Comments
Please login to add a commentAdd a comment