బంద్ కారణంగా నిలిచిపోయిన వాహనాలు
సాక్షి, హైదరాబాద్ : మోటారు వాహన చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్‌లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో రహణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రాష్ట్రా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైయాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు వాహనాలు ఇష్టారీతిలో రేట్లు పెంచి దోచుకుంటున్నాయి.
బంద్‌కు సంఘీభావంగా సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద రైల్వే కార్మికులు బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుంచి ఇందిరా పార్క్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు. బిల్లు ఉపసంహరణతో పాటు కనీసం వేతనం రూ. 15 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్త వాహనాల బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెకు దేశ వ్యాప్తంగా రవాణారంగ అనుబంధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment