చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లికి చేరువగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ జాడ లేకుండా పోవడం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ సురక్షితంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటించడంతో చంద్రయాన్-2 మిషన్‌పై భారతీయుల ఆశలు సజీవంగా నిలిచాయి. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో ప్రకటించడంతో.. ట్విటర్‌లో #ISROSpotsVikram హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.
మరోవైపు ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్‌కు, ట్రాఫిక్ చలాన్లకు జత చేసి నాగ్‌పూర్ సిటీ పోలీసులు చేసిన ట్వీట్ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘ప్రియమైన విక్రమ్.. దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్ బ్రేక్ చేసినందుకు మేము చలాన్ విధించం’ అంటూ ట్వీట్ చేశారు. నాగ్‌పూర్ సిటీ పోలీసుల ట్వీట్‌కు విపరీతమైన పైగా లైకులు వచ్చాయి. కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు.
కొందరు నెటిజన్ల కామెంట్‌లు..
- ఒకవేళ విక్రమ్ స్పందిస్తే.. అది సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ఆ చలాన్ నాకు పంపించండి. ఆ జరిమానాను నేను కడతాను.
- ఈ కేసు బెంగళూరు పోలీసుల పరిధిలోకి వస్తుంది.
- నాకు తెలుసు నాగ్‌పూర్ పోలీసులు చంద్రునిపై కూడా ఉన్నారు.
- కానీ ఓవర్ స్పీడింగ్ పరిస్థితి?
Dear Vikram,
— Nagpur City Police (@NagpurPolice) September 9, 2019
Please respond 🙏🏻.
We are not going to challan you for breaking the signals!#VikramLanderFound#ISROSpotsVikram @isro#NagpurPolice
Comments
Please login to add a commentAdd a comment