భువనేశ్వర్: మైనర్‌ను స్కూటీ నడిపేందుకు అనుమతినిచ్చిన ఓ వ్యక్తికి పోలీసులు షాకిచ్చారు. మోటారు వాహన చట్టం- 2019 ఉల్లంఘించిన కారణంగా అతడికి బుధవారం రూ.26 వేలు ఫైన్ వేశారు. వివరాలు... భువనేశ్వర్‌లోని కందగిరి ప్రాంతంలో మైనర్ ఇంకో వ్యక్తి స్కూటీ నడపడంతో జరిమానా విధించారు. ఈ స్కూటీ నిరంజన్ డాష్ అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు తెలిపారు. యజమాని స్కూటీని పిల్లవాడికి ఇచ్చి చట్టాన్ని ఉల్లఘించడంతో రూ.25 వేల రూపాయలు జరిమానా విధించగా , బాలుడు హెల్మెట్ ధరించకపోవడంతో మరో రూ.1000 జరిమానా విధించారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో సెక్షన్ 207 కింద కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ మైనర్ బండి నడపడంతో అతడికి తండ్రికి భారీ జరిమానా పడిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమించినందుకు గానూ మొత్తంగా అన్నీ కలి కలిపి రూ. 42,500 చలాన్ విధించారు. రూ. 500 సాధారణ నేరం, రూ. 5000 డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, రూ. 5000 ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా బండి నడపడం, రూ. 1000 టూ వీలర్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండటం, రూ. 1000 హెల్మెట్ లేకుండా నడపటం, రూ. 25,000 మోటార్ వాహన చట్టం- 2019 కింద జరిమానాను విధించారు.
ఇక రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ప్రకారం రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్టీఏ) ఇటీవల ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించాలని తప్పనిసరి నిబంధనల విధించింది. హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్స్ పట్టుబడితే రైడర్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment