
జైపూర్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తున్నారు. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారంటూ వింత కారణాలు చూపిస్తూ జరిమానాలు విధించడంపై పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అలాంటి సంఘటనే మరోకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్ అనే టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సెప్టెంబర్ 6న చోటు చేసుకుంది. కాగా రాజస్తాన్ ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తేలేదు.
Comments
Please login to add a commentAdd a comment