challaned
-
గుండీలు పెట్టుకోలేదని జరిమానా
జైపూర్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తున్నారు. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారంటూ వింత కారణాలు చూపిస్తూ జరిమానాలు విధించడంపై పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అలాంటి సంఘటనే మరోకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. చెప్పులు వేసుకోలేదని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్ అనే టాక్సీ డ్రైవర్‌కి చలానా విధించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సెప్టెంబర్ 6న చోటు చేసుకుంది. కాగా రాజస్తాన్ ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తేలేదు. -
కారులో హెల్మెట్ పెట్టుకోలేదని..
మీరట్: కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ విధించిన విచిత్ర సంఘటన మీరట్ లో చోటు చేసుకుంది. పోలీసులు ఒక అడుగు ముందుకేసి మారుతీ స్విఫ్ట్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఇచ్చిన చలాన్ లో హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో ఫైన్ వేశారు. దీంతో ఆ కారు నడిపిన వ్యక్తి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ని ఆశ్రయించారు. ఈ సంఘటనపై ఆ అధికారి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెలితే.. శైలేందర్ సింగ్(43) కారులో వెళ్తుండగా హసన్ పుర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు ఆపి కారుపేపర్లు చూపించాలన్నాడు. ఆయన పేపర్లన్నీ చూపించినా.. ఆ పోలీసు అధికారి వదల్లేదు. 'నా నాలుగు నెలల కుమారుడికి ఆరోగ్యం బాగాలేదు. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాదేయపడ్డాను. ఆ తర్వాత మా మధ్య వాడివేడిగా చర్చజరిగింది. అనంతరం హెల్మెట్ ధరించలేదని చలాన్ ఇచ్చాడు. కారు నడుపుతున్నపుడు హెల్మెట్ ధరించాలని.. నేను కనీసం ఎప్పుడూ వినను కూడా వినలేదు. ఇది అన్యాయం' అని శైలేందర్ అన్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి తప్పు చేసినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దూబే తెలిపారు.