కారులో హెల్మెట్ పెట్టుకోలేదని.. | Man in car challaned for not wearing helmet! | Sakshi
Sakshi News home page

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని..

Published Tue, May 26 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని..

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని..

మీరట్: కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ విధించిన విచిత్ర సంఘటన మీరట్ లో చోటు చేసుకుంది. పోలీసులు ఒక అడుగు ముందుకేసి మారుతీ స్విఫ్ట్ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఇచ్చిన చలాన్ లో హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో ఫైన్ వేశారు. దీంతో ఆ కారు నడిపిన వ్యక్తి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ని ఆశ్రయించారు. ఈ సంఘటనపై ఆ అధికారి విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెలితే.. శైలేందర్ సింగ్(43) కారులో వెళ్తుండగా హసన్ పుర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు ఆపి  కారుపేపర్లు చూపించాలన్నాడు. ఆయన పేపర్లన్నీ చూపించినా.. ఆ పోలీసు అధికారి వదల్లేదు. 'నా నాలుగు నెలల కుమారుడికి ఆరోగ్యం బాగాలేదు. త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాదేయపడ్డాను. ఆ తర్వాత మా మధ్య వాడివేడిగా చర్చజరిగింది. అనంతరం హెల్మెట్ ధరించలేదని చలాన్ ఇచ్చాడు. కారు నడుపుతున్నపుడు హెల్మెట్ ధరించాలని.. నేను కనీసం ఎప్పుడూ వినను కూడా వినలేదు. ఇది అన్యాయం' అని శైలేందర్ అన్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి తప్పు చేసినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దూబే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement