న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) వీకే సక్సేనా ఇరుకునపెట్టారు. అసలే కష్టాల్లో ఉన్న ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉన్న మంచి నీటి సమస్యపై కేజ్రీవాల్‌కు మంగళవారం(ఏప్రిల్16) ఒక బహిరంగ లేఖ రాశారు.
గత పదేళ్ల నుంచి ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడానికి ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఎల్‌జీ విమర్శించారు. ప్రస్తుతం వచ్చిన మంచినీటి సమస్య సడెన్‌గా రాలేదని, ప్రతి ఏడాది ఈ సమస్య వస్తోందని గుర్తు చేశారు.
మంచినీటి సమస్యపై గతంలో మీడియా ప్రచురించిన కథనాలను లేఖకు ఎల్‌జీ జత చేశారు. మంచి నీటి సరఫరా విషయంలో ఢిల్లీ కంటే ముంబై,చెన్నై,పుణె నగరాలు బెటర్‌గా ఉన్నాయని తెలిపారు. కాగా, లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇదీ చదవండి.. నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయ్.. కోర్టులో కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment