- కాబోయే సీఎం అతిషితో పాటు ఎల్జీని కలిసిన కేజ్రీవాల్
- సీఎం పదవికి రాజీనామా సమర్పించిన ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్
- అతిషి కొత్త సీఎం అని ఎల్జీకి తెలిపిన కేజ్రీవాల్
- తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరిన అతిషి
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం(సెప్టెంబర్17) సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకేసక్సేనా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. ఎల్జీని కలిసేందుకు కేజ్రీవాల్ వెంట ఆమ్‌ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, కాబోయే సీఎం అతిషి, మంత్రులు ఉన్నారు. అతిషిని కొత్త సీఎంగా ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ తెలిపారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariate
Arvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024
కాగా, రెండు రోజల క్రితం ఆప్ పార్టీ మీటింగ్‌లో చెప్పినట్లుగానే కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి ఇప్పటికే మంత్రి ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం జరిగిన ఆమ్‌ఆద్మీపార్టీ శాసనాసభాపక్షంలోనూ అతిషి పేరును కొత్త సీఎం పదవికి ఆమోదించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరిన అతిషి..
రాజీనామా చేసేందుకు ఎల్జీ వద్దకు వెళ్లిన మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటే కాబోయే సీఎం అతిషి కూడా వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా సమర్పించిన తర్వాత ఆమె ఎల్జీని కలిశారు. తనను కొత్త సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె ఎల్జీని కోరారు. తనకు ఆమ్‌ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ఆమె ఈ సందర్భంగా ఎల్జీకి అందించినట్లు తెలిసింది.
#WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariate
Arvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024
ఇదీ చదవండి.. కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment