ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆప్ నేతల సమ్మె రెండోవారానికి చేరడంతో సోమవారం పార్టీ నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశం కానున్నారు. కాగా ఎల్జీ కార్యాలయంలో ఆప్ ధర్నాను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. వేరొకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని కోర్టు నిలదీసింది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య కీచులాటలు కొనసాగుతున్న క్రమంలో తాజాగా ఐఏఎస్ అధికారులు రంగంలోకి దిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని బాధితులని చేస్తున్నారని వారు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధికారులు తమ కుటుంబంలో భాగమేనని, వారి భద్రతకు తాను భరోసా ఇస్తానని సీఎం కేజ్రీవాల్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.
ఐఏఎస్ అధికారుల సమ్మెతో ఢిల్లీలో పరోక్షంగా రాష్ట్రపతి పాలన సాగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేపట్టిన ఆందోళనను సమర్ధిస్తూ సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment