
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నాపై రెబల్ ఎమ్మెల్యే, ఆప్ మాజీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు. కనీసం బట్టలు అయినా మార్చుకోండంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం గారు.. దయచేసి మీరు, మీ బృందం బట్టలు మార్చుకోండి. అలాగే ఉంటే అనారోగ్యపాలవుతారు. బట్టలు మార్చుకోవద్దని మోదీ ఏం చెప్పలేదు’ అని ట్వీట్ చేశారు.
కాగా తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టినధర్నానాలుగో రోజుకు చేరింది. మరో వైపు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి వైద్య ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లు ఆమర నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసం నుంచి గవర్నర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి, భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజలకు రేషన్ సరకులను డోర్‌డెలవరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారుపై చర్యలు తీసుకోవాలని, వారు సమ్మె విరమించేలా చొరవ చూపాలని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
ఇదికూడా చదవండి
కేజ్రీవాల్‌కు షాక్
Comments
Please login to add a commentAdd a comment