ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నెలకొన్న తీవ్రమై నీటి సంక్షోభాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ నీటి సమస్యపై శుక్రవారం కేజ్రీవాల్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘‘దేశవ్యాప్తంగా ఎండలు విపరీంతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరెంట్, తాగు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఢిల్లీలో కరెంట్ వినియోగం 7,438 మెగావాట్లు ఉండగా.. ఈసారి గరిష్టంగా 8,302 మెగావాట్లకు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం పవర్ కట్ సమస్యలు లేవు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే కరెంట్ విషయంలో ఢిల్లీ మెరుగ్గా ఉంది. మరోవైపు.. అధిక ఎండల కారణంగా నీటి వినియోగం పెరిగింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటి సరాఫరా తగ్గిపోయింది. అక్కడ కూడా నీటి డిమాండ్ చాలా పెరిగిపోయింది.
इस बार पूरे देश में अभूतपूर्व गर्मी पड़ रही है जिसकी वजह से देश भर में पानी और बिजली का संकट हो गया है। पिछले वर्ष, दिल्ली में बिजली की पीक डिमांड 7438 MW थी। इसके मुक़ाबले इस साल पीक डिमांड 8302 MW तक पहुँच गयी है। पर इसके बावजूद दिल्ली में बिजली की स्थिति नियंत्रण में है, अन्य…
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024
అందరం కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని మేము ముందుకు వస్తే.. బీజేపీ మాత్రం మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది. ఇలా అయితే నీటి సమస్యకు పరిష్కారం లభించదు. రాజకీయాలు పక్కన పెట్టి అందరం ముందుకు వచ్చి నీటి సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి కోరుతున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఒక నెల పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా, ఉత్తర పదేశ్ రాష్ట్రాల నుంచి నీటి సరాఫరా చేయిస్తే.. ఢిల్లీ ప్రజలు బీజేపీ చొరవను మెచ్చుకుంటారు. మనమంతా కలిసి పని చేస్తే ఢిల్లీ వాసులకు నీటి సమస్య తగ్గుతుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.
నీటీ సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. నీటి వాడకంపై అత్వవసర మార్గదర్శకాలు విడుదల చేసింది. తాగు నీటితో కారు వాషింగ్ చేయోద్దని, నిర్మాణ రంగ సైట్లలో కూడా తాగు నీటిని వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment