జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉంది. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు (సోమవారం) ప్రకటించారు. తాగునీటికి కొరత లేదని దీనికోసం బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తగినన్ని నిధులు సమకూరుస్తున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నగర పాలక సంస్థ అధికారులతో సమావేశం వెల్లడించారు.
బెంగళూరులోని 14,000 బోర్‌వెల్స్‌లో 6900 ఎండిపోయాయి. నగరంలో ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ నీటి కొరతను తీర్చడానికి కావలసినన్ని జలాలు ఉన్నాయి. బెంగళూరులో మాత్రమే కాకుండా చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకు కూడా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు.
కబినీ, కేఆర్‌ఎస్ డ్యామ్‌లలో సరిపడా నీరు ఉంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఇప్పుడు నీటి కొరతను నియంత్రించడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికోసం 313 కొత్త బోర్లు వేయనున్నట్లు స్పష్టం చేశారు. క్రియారహితంగా ఉన్న 1200 బోర్లను పునరుద్ధరిస్తామని చెప్పారు
బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్ణీత ధరలకే నీటిని సరఫరా చేయాలని రెండు వారాల క్రితం ప్రభుత్వం ప్రైవేటు ట్యాంకర్లను ఆదేశించింది. దీని కోసం దాదాపు 1700 వాటర్ ట్యాంకర్లను రిజిస్టర్ చేశామని, ప్రైవేట్ బోర్‌వెల్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment