
సాక్షి, న్యూఢిల్లీ : నదుల అనుసంధానంతోనే నీటి సంక్షోభాన్ని పరిష్కరించగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు సంక్షోభం - సవాళ్లు అనే అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రుతుపవనాల వైఫల్యమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. అంతరించి పోతున్న అడవులు మరో కారణమని తెలిపారు. నదుల అనుసంధానమే నీటి సంక్షోభానికి సరైన పరిష్కారం అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.