iron tablets
-
వికటించిన ఐరన్ మాత్రలు
సాక్షి, జనగామ: జనగామ మండలం చౌడారం మోడల్ పాఠశాల విద్యార్థినులు గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఐరన్ మాత్రలు మింగిన విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మళ్లీ ఐరన్ మాత్రలు తీసుకున్న విద్యార్థినుల్లో సుమారు 20 మందికి పైగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహ నిర్వాహకులు తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. -
గురుకులంలో టెన్షన్ టెన్షన్..
సాక్షి, ఆదిలాబాద్‌రూరల్ :ఐరన్ మాత్రలు వికటించి.. 57 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్ అనుకుంట మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో గురువారం వెలుగు చూసింది. మండల వైద్యాధికారి రోజారాణి విద్యార్థులకు పాఠశాలలో పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువకుంటున్నారని, గురువారం అల్పాహారం చేసి.. ఐరన్ మాత్రలు వేసుకున్నారని, మధ్యాహ్నం కొందరు వాంతులు చేసుకున్నారని, తల తిప్పుతున్నట్లు అనిపిస్తోందని చెప్పగా.. వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించామన్నారు. 57మంది విద్యార్థినుల్లో 40 మందికి తీవ్ర అస్వస్థత ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ గోపీచంద్ పరిస్థితిని సమీక్షించారు. వాంతులు చేసుకుంటున్న విద్యార్థిని -
ఈ టైమ్‌లో వాడితే సైడ్ఎఫెక్ట్సా?
నా శరీరంలో ఐరన్ తక్కువగా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణిగా ఉన్నప్పుడు మామూలు కంటే రెండింతలు ఎక్కువ ‘ఐరన్’ అవసరం అని విన్నాను. ఐరన్ పెరగడానికి ఏమైనా ప్రత్యేక మందులు ఉన్నాయా? ఈ టైమ్‌లో వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – బి.నళిని, తాడేపల్లిగూడెం రక్తంలో హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది రక్తం నుంచి శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్ అందిస్తుంది. దీని తయారీకి ఐరన్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తం మామూలు వారి కంటే ఎక్కువ తయారవుతుంది. రక్తం పెరగడానికి, హీమోగ్లోబిన్ శాతం పెరగడానికి గర్భిణులకు రెట్టింపు ఐరన్ అవసరమవుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే, హీమోగ్లోబిన్ శాతం తగ్గి, తల్లిలో రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల తల్లిలో ఆయాసం, నీరసం, ఇంకా ఇతర సమస్యలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా రక్తసరఫరా సరిగా లేకుంటే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణి సమయంలో ఐరన్ ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, బీన్స్, కూరగాయలు, పండ్లు, పప్పులు, మాంసాహారంలో మటన్, చికెన్, లివర్, బోన్‌సూప్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో ఐరన్ త్వరగా చేరడానికి విటమిన్–సి అవసరమవుతుంది. దీనికి టమాటాలు, ఉసిరి, ఆరెంజెస్ వంటివి కూడా ఆహారంలో తీసుకోవాలి. కాఫీ, టీ వంటివి ఐరన్ రక్తంలో చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు పోషకాహారంతో పాటు డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్లు, సిరప్ లేదా ఇంజెక్షన్లు తీసుకోవాలి. గర్భిణి సమయంలో ఐరన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ వల్ల కొందరిలో వికారం, వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు ఉండవచ్చు. కొందరు వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఐరన్ వల్ల మలం నల్లగా వస్తుంది. దీనికి భయపడనవసరం లేదు. మా బంధువుల అమ్మాయి ఒకరు పద్దెనిమిది సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయింది. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ప్రమాదం అని అంటారు కదా! ప్రమాదం జరగకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం దాల్చడానికి ఏ వయసు సరైనదో తెలియజేయగలరు. – కె.వైష్ణవి, గూడూరు సాధారణంగా ఇరవై సంవత్సరాలకు ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఎదగడం జరుగుతుంది. అలాగే వీరి పెల్విస్ వెడల్పు అవడం, ఎముకలు పటిష్టంగా ఉండటం జరుగుతుంది. అమ్మాయిలు పిల్లలను కనడానికి 21 నుంచి 28 సంవత్సరాలు అనువైన వయసు. 18 సంవత్సరాల కంటే చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ బయటకు వచ్చే ద్వారం బలహీనంగా ఉండటం వల్ల కాన్పులో ఇబ్బందులు ఏర్పడం వంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికాలంలోఅమ్మాయిలు 18 సంవత్సరాలకు పుట్టింట్లో చిన్నపిల్లలుగానే ముద్దుగా, మురిపెంగా పెరుగుతున్నారు. వీరు మానసికంగా, శారీరకంగా పిల్లలను కనడానికి సంసిద్ధంగా ఉండరు. దానివల్ల గర్భం దాలిస్తే మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. చిన్న వయసులో గర్భం దాల్చినప్పుడు డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్లడం, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు, సరైన పోషకాహారం తీసుకోవడం, ఎముకల పటిష్టత కోసం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కాల్షియం మాత్రలు తీసుకోవడం చేయాలి. బీపీ వంటి ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు డాక్టర్ సంరక్షణలో అది ముదరక ముందే చికిత్స తీసుకోవాలి. కాన్పును ఇళ్లలో కాకుండా, అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలో జరిగేలా చూసుకోవాలి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం ఇవ్వడం మంచిది. చలికాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఈ కాలానికి సంబంధించి ముఖ్యమైన నూట్రిషియన్స్ టిప్స్ తెలియజేయగరు. – జి.త్రివేణి, సంగారెడ్డి సాధారణంగా గర్భిణి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీనివల్ల వానాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చలికి ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఉండటం, అది కూడా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఉలెన్ డ్రెస్‌లు వేసుకుని పూర్తిగా కప్పుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. బయట చల్లగా ఉన్నా, తేమ ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కూడా కనీసం 2–3 లీటర్ల (ఫిల్టర్ వాటర్ లేదా కాచి వడబోసిన నీళ్లు) మంచినీళ్లు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిసారీ తినేముందు, మలమూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో చర్మం పగిలి పొడిగా ఉండటం వల్ల దురద, మంట ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో మాయిశ్చరైజర్ వాడుకోవడం మంచిది. వేడిగా పాలు, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
పాపం.. పసివాళ్లు
వనపర్తి క్రైం/ వనపర్తి అర్బన్: ‘ఐరన్’ మాత్రలు వేసుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం వనపర్తిలో కలకలం రేపింది. తినక ముందు మాత్రలు వేయడం, వాటిని వేసుకునే ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేయడంలో ఏఎన్ఎం, ఆశలు నిర్లక్ష్యం వహించడంతో 37 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ఏరియా ఆస్పత్రి మారుమోగింది. వివరాలిలా.. తినకుండా వేసుకోవడంతో.. మండలంలోని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గురువారం రాష్ట్రీయ బాలికల ఆరోగ్య పథకంలో భాగంగా (స్కూల్ హెల్త్) పాఠశాలలోని విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేస్తారు. అయితే గురువారం సవాయిగూడెంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలను ఏఎన్ఎం, ఆశలు పంపిణీ చేశారు. అయితే విద్యార్థులు తిన్న తర్వాత మాత్రలు వేసుకోవాలి. కానీ కొంతమంది విద్యార్థులు ఉదయం తినకుండా పాఠశాలకు వచ్చారు. ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం సాయిన్‌బేగం, ఆశ వెంకటేశ్వరమ్మ 63 మంది విద్యార్థులకు ఐరన్, సీ విటమిన్ మాత్రలు వేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 37 మంది విద్యార్థులకు వాంతులు కావడం, కడపునొప్పితో బాధపడటంతో ఉపాధ్యాయులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కొంతమంది విద్యార్థులను ఆటోలో, అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఒక్కో బెడ్డుపై ఇద్దరు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే.. ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఐరన్, సీ విటమిన్ మాత్రలు పంపిణీ చేయడం వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు మాత్రలు వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాత్రలు వేసే ముందు విద్యార్థులు తిన్నారో లేదో చూసుకోవాలి. అలా ఏదీ చూడకుండా విద్యార్థులకు ఉదయమే మాత్రలు వేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసి కడుకుంట్ల ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎం, ఆశలు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థు లు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్న తీరును చూసి ఖంగుతిన్నారు. విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. పాఠశాలలో గత సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్యఆరోగ్యశాఖ విద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీచేశారు. వాటిని మధ్యాహ్నం, రాత్రి అన్నం తిన్న తర్వాత తీసుకోవాలని సూచించారు. అయితే గురువారం ఉదయం టిఫిన్ చేశాక కొందరు విద్యార్థులు ఐరన్ మాత్రలు వేసుకున్నారు. అవి వికటించి వాంతులు కావడంతో అప్రమత్తమైన సిబ్బంది బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఐరన్ మాత్రలు వికటించడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం అల్పాహారంలో వడ చేశారని. వడ తిన్నందువల్లే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదంత్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సమీప ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య గురించి వాకబుచేశారు. -
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్ధుల అస్వస్ధత
-
22 మంది విద్యార్ధులకు అస్వస్థత
అనంతపురం(కళ్యాణదుర్గం): ఐరన్ మాత్రలు వికటించడంతో 22మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వెంటనే వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు అందిచ్చిన ఐరన్ మాత్రలు వికటించడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వైద్యులు తెలిపారు. -
ZPHSలో వికటించిన ఐరన్ మాత్రలు
-
ధర్మారం పాఠశాలలో కలకలం
- వికటించిన ఐరన్ మాత్రలు - ధర్మారం పాఠశాలలో 350 మందికి అస్వస్థత - ఉపాధ్యాయుల అవగాహన రాహిత్యం, వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం - ఎంజీఎంలో మిన్నంటిన రోదనలు గీసుకొండ/ఎంజీఎం : ఐరన్ మాత్రలు వికటించడంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు మంగళ వా రం అస్వస్థతకు గురైన ఘటన కలకలం సృష్టిం చింది. మధ్యాహ్నం భోజనం తర్వాత వేయాల్సిన మాత్రలను అంతకుముందే వేయడంతో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా, గందరగోళ పరిస్థితులు నెలకొన్నారుు. స్థానికులు, తల్లిదండ్రుల సాయం తో అస్వస్థతకు గురైన విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జవహర్‌బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థుల్లో రక్త హీనత నివారణకు ‘ఐరన్ ఫోలిక్ యాసిడ్’ మాత్రలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేస్తారు. ఈ క్రమంలోనే గీసుకొండ పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ సత్యరాజ్, ధర్మారం ఏఎన్ఎం వరలక్షి, ఆశ కార్యకర్తలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు మాత్రలు వేసి వె ళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు ముగ్గురు విద్యార్ధులు కడుపునొప్పి వస్తోందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఈ విషయమై పీహెచ్సీ ైవె ద్యులు, సిబ్బందికి ఇన్చార్జ్ హెడ్మాస్టర్ బిక్షపతి పలు మార్లు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. ఇదే క్రమంలో పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు ఇదేవిధంగా అనారోగ్యానికి గురికావడంతో పాఠశాలలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయగా, పాఠశాల ఆవరణ కిక్కిరిసిపోయింది. ఏం జరగుతుందో తెలియక అయోమయం నెలకొంది. సుమారు 300 మంది విద్యార్థుల వరకు ఆస్పత్రిలో చేరారు. గ్రామస్తుల సహకారంతో... అస్వస్తతకు గురైన విద్యార్థులను గ్రామస్తులు వెన్నంటి ఉండి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్-నర్సంపేట రహదారిపై వెళ్లే ఆటోలు, ప్రైవేటు కళాశాలలు. పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు ఆపి అందులో విద్యార్ధులను పంపించారు. టీఆర్ఎస్ నాయకులు ముంత రాజయ్య, గోలి రాజయ్య, సుంకరి శివ, గట్టికొప్పుల రమేశ్, పిట్టల రాజు,పోలెబోయిన కృష్ణ, పోలెబోయిన సాంబయ్య, గట్టికొప్పుల సదానందం, గోదాసి ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు గోదాసి చిన్న , బీజేపీ నాయకుడు గట్టికొప్పుల రాంబాబు, తహసీల్దార్ మార్గం కుమారస్వామి, గీసుకొండ సీఐ నాగేశ్వర్రావు, ఎంపీడీఓ సుమాదేవి దగ్గరుండి విద్యార్థులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మార్మోగిన ఎంజీఎం అస్వస్థతకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు, వారి బంధులతో ఎంజీఎం ఆస్పత్రి కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీలోని 30 పడకలు పూర్తిగా నిండిపోవడంతో ఆర్థోవార్డుతోపటు ప్రత్యేకమైన వార్డులో విద్యార్థులకు చికిత్స అందించారు. వైద్యం కోసం తల్లిదండ్రుల పాకులాట ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు అత్యవసర పరిస్థితిలో సైతం స్పందించ లేదు. పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రత్యేకంగా వైద్యులు సమయానికి అందుబాటులో వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుంది. కానీ... ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు పలువురు వైద్యులు వందల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్న గంట సమయానికి ఆస్పత్రికి చేరుకోలేదని విమర్శలు వ్యక్తమయ్యూరుు. ఆస్పత్రిలో వైద్యం కోసం పాకులాడాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వికటించిన ఐరన్ మాత్రలు
280 మంది విద్యార్థులకు అస్వస్థత వరంగల్ జిల్లా గీసుకొండలో ఘటన హన్మకొండ: ఐరన్ టాబ్లెట్లు వేసుకునే ముందు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వరంగల్ జిల్లాలో 280 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది అదే మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్లు ఇచ్చి, వేసుకోవాల్సిందిగా సూచించారు. సదస్సు అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి సదరు మాత్రలు వేసుకున్నారు. తిరిగి తరగతులు ప్రారంభమయ్యే సమయంలో కొందరు విద్యార్థులు కళ్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాల కనిపించడంతో ఉపాధ్యాయులను సంప్రదించారు. వీరిని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఇవే లక్షణాలతో మరికొంతమంది విద్యార్థుల ఇబ్బందిపడ్డారు. స్థానికులు 108 వాహనాలు, ప్రైవేటు స్కూలు బస్సులో 300 మంది విద్యార్థులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రి వైద్యులు వీరికి వెంటనే వైద్య సహాయం అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో రాత్రి 9 గంటల సమయంలో చాలా మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 67 మంది విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అవగాహన లేకుండా: సాధారణంగా ఐరన్ ట్యాబెట్లు రాత్రి సమయాల్లో వేసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తారు. పగటి సమయంలో వేసుకోవాల్సి వస్తే ఆహారం తీసుకున్న తర్వాతే ఈ ట్యాబెట్లు వేసుకోవాలని సూచిస్తారు. ఈ జాగ్రత్తలు పాటించకుండా ఐరన్ ట్యాబెట్లలో మింగితే దీనితో ఉండే ఫై సల్ఫేట్ మూలకం కారణంగా వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాఠశాలకు వచ్చిన వైద్యసిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారు. సీఎం కేసీఆర్ ఆరా... విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్ దగ్గరుండి వైద్యులను విద్యార్థుల వద్దకు తీసుకెళ్లారు. -
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత
వరంగల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఐరన్ మాత్రలు వికటించి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. (గీసుకొండ) -
వికటించిన ఐరన్ మాత్రలు
ధర్పల్లి : ఐరన్ మాత్రలు వికటించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు సుశీల, నాగమణి సూచించినట్లుగానే భోజనం చేసిన తర్వాతే విద్యార్థినులు మాత్రలు వేసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. 22 మంది అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ధర్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. స్టాఫ్ నర్సులు ఉమ, హప్రీన్లు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించారు. హెచ్ఈఓ కిషన్‌రావు, ఏఎన్ఎంలు గంగామణి, నాగమణితో పాటు ఎంఎల్ఓ లింగమయ్య విద్యార్థులను పరామర్శించారు. డాక్టర్లే లేరు ధర్పల్లి ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ ఉండాలి. అయితే ఐరన్ మాత్రలతో అస్వస్థతకు గురి అయిన వారిని ఆస్పత్రికి తరలించినప్పుడు డాక్టర్ ఒక్కరు కూడా లేక పోవటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు వెంటనే మెడికల్ ఆఫీసర్ స్వాతికి సమాచారం అందించారు. ఆమె జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మాత్రల్లో లోపం లేదని, భోజనం చేయకుండా మాత్రలు వేసుకున్నందునే అస్వస్థతకు గురై ఉంటారని వైద్యురాలు తెలిపారు. ఎలాంటి ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు. -
ఆరోగ్యానికి....రక్షా...శిక్షా!?
బోనకల్, న్యూస్‌లైన్ : కొండనాలుకకు మందిచ్చి.. ఉన్న నాలుకను ఊడగొట్టేటట్టుంది అధికారుల తీరు. జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకం ద్వారా రక్తహీనత నివారణకు పంపిణీ చేసిన మాత్రలు విద్యార్థులను అస్వస్థతకు గురిచేశాయి. 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ ఘటన బోనకల్ మండల పరిధిలోని మోటమర్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... మోటమర్రిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 300 మంది చదువుకుంటున్నారు. జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకంలో రక్తహీనత నివారణ కోసం అధికారులు సరఫరా చేసిన ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను ఉపాధ్యాయులు గురువారం విద్యార్థులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నభోజనం అనంతరం విద్యార్థులు వాటిని వేసుకున్నారు. పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు వైద్యం చేయించారు. శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మళ్లీ వాంతులు చేసుకున్నారు. కళ్లుతిరిగి పడిపోయారు. దీంతో ఉపాధ్యాయులు బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వైద్యాధికారి విజయచందర్ సెలవులో ఉండడంతో ఏఎన్ఎంలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు అక్కడే సెలైన్ ఎక్కించారు. తమ పిల్లలు మళ్లీ అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు మాత్రలు ఎలా ఇచ్చారని ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాలను సందర్శించిన అధికారులు పాఠశాలను మధిర డి ప్యూటీ డీఈఓ బానోతు రాములు, ఎంఈఓ ఎం.శ్యాంసన్ సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. ఇంత జరుగుతున్నా ైవైద్యులు రాకపోవడంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓపై గ్రామస్తులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈక్రమంలో జిల్లా వైద్యాధికారులకు డిప్యూటీ డీఈఓ సమాచారం అందించారు. మధిర నుంచి వైద్యాధికారులను పంపించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి మెరుగు పడకపోతే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. వైద్య శిబిరాన్ని 24 గంటలపాటు కొనసాగిస్తామన్నారు. ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను అధికారులు పరిశీలించారు. ఎక్స్పైరీ డేట్ 2015 వరకు ఉన్నా ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు రాయల శ్రీనివాసరావు, కంటెపూడి శ్రీనివాసరావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్, ఏఎన్ఎంలు లక్ష్మి, జయమ్మ, ఆశా కర్యాకర్తలు వైద్య సేవలు అందించారు. -
మాత్రలు వికటించి..
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఐరన్ ట్యాబ్లెట్లు వికటించి దాదాపు 30 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో పాటు నందిమండలం పీహెచ్సీ వైద్యులు పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండలం నందిమండలం జిల్లా పరిషత్ ైెహ స్కూల్లో శనివారం ఉద యం 11 గంటలకు పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం కేశవ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు తిన్న కొద్ది సేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు కడుపునొప్పితో మరికొందరు వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు మహ్మద్ రఫీ, నందిమండలం పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ఇంజెక్షన్‌తో పాటు ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చారు. చెన్నూరు క్లస్టర్ వైద్యుడు ఇబ్రహీం, తహశీల్దార్ వేదనాయకం, వీఆర్వో సాంబశివారెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. తాము ఇంటిదగ్గరే టిఫిన్ చేసినట్లు విద్యార్థులు చెప్పడంతో ఐరన్ మాత్రలు ఇచ్చినట్లు ఇన్చార్జి హెచ్ఎం కేశవ పేర్కొన్నారు. ఉదయం ఇవ్వడం వల్లనే... పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతి గురువారం భోజనం చేసిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. గురువారం విద్యార్థులు తక్కువగా ఉన్నారని శనివారం ఉదయం 11 గంటలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అన్నం తినకుండా ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డి ఏమంటున్నారంటే... విద్యార్థులు అన్నం తిన్న తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఉదయం 11 గంటలకే మాత్రలు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. వైద్యసేవలు అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు. నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది ఇన్ఛార్జ్ హెచ్ఎం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన మాత్రలు ఉదయమే ఇచ్చారు. ఇది ముమ్మాటికి నిర్లక్షమే. - వెంకటసుబ్బయ్య, విద్యార్థి తండ్రి, నంది మండలం