- వికటించిన ఐరన్ మాత్రలు
- ధర్మారం పాఠశాలలో 350 మందికి అస్వస్థత
- ఉపాధ్యాయుల అవగాహన రాహిత్యం, వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
- ఎంజీఎంలో మిన్నంటిన రోదనలు
గీసుకొండ/ఎంజీఎం : ఐరన్ మాత్రలు వికటించడంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు మంగళ వా రం అస్వస్థతకు గురైన ఘటన కలకలం సృష్టిం చింది. మధ్యాహ్నం భోజనం తర్వాత వేయాల్సిన మాత్రలను అంతకుముందే వేయడంతో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా, గందరగోళ పరిస్థితులు నెలకొన్నారుు. స్థానికులు, తల్లిదండ్రుల సాయం తో అస్వస్థతకు గురైన విద్యార్థులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జవహర్‌బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థుల్లో రక్త హీనత నివారణకు ‘ఐరన్ ఫోలిక్ యాసిడ్’ మాత్రలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేస్తారు. ఈ క్రమంలోనే గీసుకొండ పీహెచ్‌సీ హెల్త్ సూపర్‌వైజర్ సత్యరాజ్, ధర్మారం ఏఎన్‌ఎం వరలక్షి, ఆశ కార్యకర్తలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు మాత్రలు వేసి వె ళ్లిపోయారు.
మధ్యాహ్నం 2 గంటలకు ముగ్గురు విద్యార్ధులు కడుపునొప్పి వస్తోందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఈ విషయమై పీహెచ్‌సీ ైవె ద్యులు, సిబ్బందికి ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ బిక్షపతి పలు మార్లు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకుని వెళ్లి చికిత్స చేయించారు. ఇదే క్రమంలో పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు ఇదేవిధంగా అనారోగ్యానికి గురికావడంతో పాఠశాలలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయగా, పాఠశాల ఆవరణ కిక్కిరిసిపోయింది. ఏం జరగుతుందో తెలియక అయోమయం నెలకొంది. సుమారు 300 మంది విద్యార్థుల వరకు ఆస్పత్రిలో చేరారు.
గ్రామస్తుల సహకారంతో...
అస్వస్తతకు గురైన విద్యార్థులను గ్రామస్తులు వెన్నంటి ఉండి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్-నర్సంపేట రహదారిపై వెళ్లే ఆటోలు, ప్రైవేటు కళాశాలలు. పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు ఆపి అందులో విద్యార్ధులను పంపించారు. టీఆర్‌ఎస్ నాయకులు ముంత రాజయ్య, గోలి రాజయ్య, సుంకరి శివ, గట్టికొప్పుల రమేశ్, పిట్టల రాజు,పోలెబోయిన కృష్ణ, పోలెబోయిన సాంబయ్య, గట్టికొప్పుల సదానందం, గోదాసి ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు గోదాసి చిన్న , బీజేపీ నాయకుడు గట్టికొప్పుల రాంబాబు, తహసీల్దార్ మార్గం కుమారస్వామి, గీసుకొండ సీఐ నాగేశ్వర్‌రావు, ఎంపీడీఓ సుమాదేవి దగ్గరుండి విద్యార్థులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మార్మోగిన ఎంజీఎం
అస్వస్థతకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు, వారి బంధులతో ఎంజీఎం ఆస్పత్రి కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీలోని 30 పడకలు పూర్తిగా నిండిపోవడంతో ఆర్థోవార్డుతోపటు ప్రత్యేకమైన వార్డులో విద్యార్థులకు చికిత్స అందించారు.
వైద్యం కోసం తల్లిదండ్రుల పాకులాట
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు అత్యవసర పరిస్థితిలో సైతం స్పందించ లేదు. పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రత్యేకంగా వైద్యులు సమయానికి అందుబాటులో వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుంది. కానీ... ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు పలువురు వైద్యులు వందల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్న గంట సమయానికి ఆస్పత్రికి చేరుకోలేదని విమర్శలు వ్యక్తమయ్యూరుు. ఆస్పత్రిలో వైద్యం కోసం పాకులాడాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.