అనంతపురం(కళ్యాణదుర్గం): ఐరన్ మాత్రలు వికటించడంతో 22మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వెంటనే వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు అందిచ్చిన ఐరన్ మాత్రలు వికటించడంతోనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వైద్యులు తెలిపారు.