సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కళాశాల పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలు రెట్టింపయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీతోపాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 7 కేటగిరీలకు చెందిన 935 మంది పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
గురుకుల టీచర్ల సమస్యలపై ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ స్టాఫ్ సొసైటీ నేతలు కె. వెంకటరెడ్డి, ఎ.వి. రంగారెడ్డి, అర్జున, ప్రమోద్‌కుమార్ తెలిపా రు. సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.