సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల మాటల కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు(chandrababu) పాలనలో చెప్పేదొకటి.. చేసేదొకటి అని మరోసారి రుజువైంది. నెలలో ఐదో తేదీ వచ్చినా ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ(Andhra Pradesh)లో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందలేదు. నెలలో ఐదో తేదీ వచ్చినా టీచర్లకు జీతాలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (pawan Kalyan) మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటి నెలకే ఒకటో తేదీన జీతాల చెల్లింపులకు ప్రభుత్వం పరిమితమైంది. కేవలం ఒకే ఒక నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలు చెల్లించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.
ఇక.. చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీ కనీసం మూడు నెలలు కూడా అమలు చేయని వైనం నెలకొంది. సంక్రాంతి(sankranthi) నెలలో జీతాల కోసం ఏపీలో టీచర్ల ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు తెచ్చినా కూడా టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై టీచర్లు మండిపడుతున్నారు.
ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, ఐదో తేదీకి కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment