
ఎర్రపహాడ్ గురుకుల పాఠశాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్ సత్యనారాయణ
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్‌లో గల మహాత్మజ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం తనిఖీ చేశారు. హాస్టల్‌ను ఎçప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఆవరణలో రకరకాల మొక్కలను నాటాలని సూచించారు. పిల్లలను ప్రణాళిక ప్రకారం చదివించాలని, వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం గురుకుల పాఠశాలకు సంబంధించిన రికార్డులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ పోతగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment