తరగతి గదిలో విద్యార్థిని చదివిస్తున్న కలెక్టర్ శ్వేతామహంతి
వనపర్తి , గోపాల్‌పేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ శ్వేతమహంతి సూచించారు. బుధవారం ఆమె మండలంలోని మున్ననూరు ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీచేశారు. తరగతి గదుల్లో ఆమె ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. అక్షరాలను గుర్తించి చదవడానికి తడబడడంతో కలెక్టర్ ఉపాధ్యాయులను మందలించారు. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని కోరారు. చదవడం, రాయడం నేర్పించాలని సూచించారు. అనంతరం రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గదుల కొరత ఉందని, ఐదు గదులు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గదులు, మైదానం, తాగునీటి వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం అనితకుమారి, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రపంచ మహాసభలకు బస్ సౌకర్యం
వనపర్తి: హైదరాబాద్‌లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు జిల్లాకేంద్రం నుంచి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment