న్యూఢిల్లీ : దుబాయ్ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్’ ఆప్షన్‌ను తొలగించాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవడంతో, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎమిరేట్స్ తెలిపింది. ఫుడ్ ఆప్షన్స్ నుంచి హిందూ మీల్స్‌ను వెనక్కి తీసుకోవాలని, భారతీయుల మతసంబంధమైన విశ్వాసాలకు అనుగుణంగా శాంకాహారం, మాంసాహారం ఆఫర్ చేయనున్నట్టు ఎమిరేట్స్ ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని, హిందూ మీల్ ఆప్షన్‌ను కొనసాగించనున్నామని ఎమిరేట్స్ ధృవీకరించింది. దీంతో తమ హిందూ కస్టమర్లను తేలికగా గుర్తించవచ్చని, వారి అభ్యర్థనమేరకు దీన్ని కొనసాగిస్తున్నామని ఎమిరేట్స్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన వెలువరించింది.
ఎమిరేట్స్ ఎన్నో రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని, వారిలో తమ హిందూ కస్టమర్లు కూడా ఉంటారని తెలిపింది. ప్రయాణికులకు తాము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. తాము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటామని, ఇది తమ సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని ఎమిరేట్స్ తెలిపింది.
పెద్ద పెద్ద విమానయాన సంస్థలన్నీ మతపరమైన అంశాలను, ఆహార నియమాలు, వైద్య అంశాలను పరిగణలోకి తీసుకుని మీల్ ఆప్షన్లను అందిస్తూ ఉంటాయి. ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మెనూలలో ‘రిలీజియస్’ పేరు మీద స్పెషల్ మీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో హిందూ నాన్-వెజిటేరియన్ మీల్, ముస్లి, మస్సెలెం మీల్, కోషర్ మీల్ ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెజిటేరియన్ మీల్ కోసం కూడా పలు ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇండియన్ వెజ్, జైన్ మీల్, ఓరియెంటల్, వెగాన్ వంటి మీల్స్‌ను ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు అందిస్తూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment