సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 38,615 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత పదిరోజుల రికార్డును చూస్తే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలు, గురుకుల పాఠశాలల్లో కేసులు వెలుగుచూడడం, ఇతరత్రా కూడా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గత నెల (నవంబర్) ఒకటో తేదీన 160 కేసులు నమోదు కాగా, 20వ తేదీన 134 కేసులు రికార్డయ్యాయి.
29వ తేదీన కేసుల సంఖ్య 184కు పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,994కు చేరింది. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,992కి చేరిందన్నారు. ఒక్కరోజు వ్యవధిలో 184 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,68,411కి చేరిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment