కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని హైస్కూల్లో ఆరుబయట కూర్చున్న నలుగురు టెన్త్ విద్యార్థినులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment