రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్
భీమారం (వరంగల్ అర్బన్): రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల విద్య కోసం 204 గురుకుల పాఠశాలలు, 8 జూని యర్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు లేవన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో కూడా ముస్లింలకు గురుకుల వ్యవస్థ లేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం రూ.1.31 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment