మైనార్టీలకు కొత్త పథకాలు కావాలి..
మైనార్టీలకు కొత్త పథకాలు కావాలి..
Published Sun, Oct 9 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
* రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
ఎం.డి.హిదాయత్ వినతి
* మంత్రి రఘునాథరెడ్డితో సమావేశం
గుంటూరు (ఆనందపేట): రాష్ట్ర మైనా ర్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో శనివారం వెలగపూడిలోని తాత్కాలిక రాజధానిలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ సమావేశమయ్యారు. దుల్హన్ పథకంలో మార్పులు చేసి వధువు తల్లిదండ్రులకు మరింత ఆర్థిక సహాయం అందేలా చూడాలని మంత్రిని కోరినట్లు హిదాయత్ చెప్పారు. స్వయం ఉపాధి పథకాల కోసం అందిస్తున్న రుణ సహాయం బ్యాంకులతో ప్రమేయం లేకుండా ప్రత్యక్షంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించాలని, మైనార్టీల కోసం మరిన్ని నూతన పథకాలు రూపొం దించాలని కోరినట్టు తెలిపారు. సాధ్యమయినంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హమీ ఇచ్చినట్లు హిదాయత్ తెలిపారు. ఈ సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement