వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మరోసారి వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ | Ys Jagan Meeting With Muslim Minority Leaders | Sakshi

వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మరోసారి వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

Aug 22 2024 2:55 PM | Updated on Aug 22 2024 3:41 PM

Ys Jagan Meeting With Muslim Minority Leaders

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు.

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని.. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు.

‘‘ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్‌ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

మరో వైపు, ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్‌ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్‌) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్‌ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు.

కాగా, వక్ఫ్‌ భూముల పరిరక్షణకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వెల్లడించారు. వక్ఫ్‌ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన, ముస్లింలకు జగన్‌ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెం 60 జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వైఎస్ జగన్ ను కలిసిన ముస్లిం మైనారిటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement