Minority Leaders
-
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మరోసారి వైఎస్ జగన్ స్పష్టీకరణ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని.. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు.‘‘ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.మరో వైపు, ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు.కాగా, వక్ఫ్ భూముల పరిరక్షణకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన, ముస్లింలకు జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెం 60 జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
వైఎస్ జగన్ ను కలిసిన ముస్లిం మైనారిటీలు
-
చంద్రబాబుకు ముస్లిం సంఘాల వార్నింగ్
-
‘ఉదయ్‌పూర్’ కోసం.. ‘చలో ఢిల్లీ’
సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు అను గుణంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు పార్టీ, రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లాలని పలువురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలిసి సామాజిక సమతుల్యత అనివార్యతను వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో సమావేశమయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఆలోచనావిధానం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల బలాబలాల గురించి కూడా చర్చ జరిగింది. చర్చ అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని, అన్ని విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశానికి పార్టీనేతలు అద్దంకి దయాకర్, గోమాస శ్రీనివాస్, రాములునాయక్, జనక్‌ప్రసాద్, కత్తి వెంకటస్వామి, చందా లింగయ్యదొర, నరేశ్ జాదవ్, రియాజ్ అహ్మద్, భరత్ చౌహాన్, ఈర్ల కొమురయ్య, జమునా రాథోడ్, కె.వి.ప్రతాప్, లక్ష్మయ్య యాదవ్, ప్రతాప్‌సింగ్, సాజిద్‌ఖాన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో చేసిన తీర్మానాలివే... ►రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఎజెండాపై చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడిని కలవాలి. ►ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గేను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సన్మానం చేయాలి. ►సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమనే భరోసా ప్రజల్లో కల్పించేందుకు ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతలతో కలిసి జిల్లాల్లో పర్యటించాలి. ►రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల నేతల ఆధిపత్యాన్ని సహించేది లేదు. ఇతరపార్టీల నేత లు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు తీసుకురావాలి. ►ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగసభలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చించాలి. నియోజకవర్గాలవారీగా సామాజిక న్యాయ సమావేశాలు ఏర్పాటు చేయాలి. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. ►రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇప్పించే ప్రయత్నాలు చేయాలి. -
సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు: జక్కంపూడి
సాక్షి, కాకినాడ: తన కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ ఆత్మహత్యకు యత్నించిన రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన సత్తార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి గణేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సత్తార్ కుమార్తె కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా పలు పార్టీల నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి పూర్తిగా అవాస్తవం. సత్తార్ మా కుటుంబానికి ఆప్తుడు. మేము నిర్వహించిన పలు కార్యాక్రమాల్లో సత్తార్ పాల్గొన్నారు. టీడీపీ అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు నేతలు వారి స్వప్రయోజనా కోసం మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, నా సోదరుడు రాజా గెలుపుకు ఎస్సీలు, మైనార్టీలే కారణం. వారికెప్పుడు మా కుటుంబం అండగా ఉంటుంది. అల్లా దయవల్ల సత్తార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని గణేష్ పేర్కొన్నారు. సత్తార్ భార్య సమీరా బేగం మాట్లాడుతూ.. 'నా భర్త ఆత్మహత్యయత్నాన్ని కొందరు రాజకీయ పార్టీల పెద్దలు రాజకీయం చేస్తున్నారు. జక్కంపూడి గణేష్ మా కుటుంబానికి అన్యాయం చేశాడని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన మాకు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు. గణేష్ తల్లి విజయలక్ష్మీ మాకు జరిగిన అన్యాయంపై స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఫోన్ చేశారు. గణేష్ అన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి.. మా పిల్లల్ని చదిస్తానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. చేతనైతే నా భర్తను కాపాడండి. అంతే కానీ రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల నేతల్ని కోరుతున్నా' అని సమీరా బేగం అన్నారు. వైఎస్సార్సీపీ మైనార్టీ నేతలు హబీబ్ బాషా, మహ్మద్ ఆరీఫ్‌లు మాట్లాడుతూ.. 'మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్ల వేరే జిల్లాకు చెందిన అనామకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. ద్వారంపూడికి ముస్లింలకు మధ్య ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ముస్లింలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సత్తార్ కుమార్తె విషయంలో టీడీపీ నేతలు కెమెరాలతో వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ నిందితులను అరెస్టు చేసింది. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంత వరకు ఎందుకు స్పందించలేదు' అని మైనార్టీ నాయకులు ప్రశ్నించారు. -
మైనారిటీ యూనివర్సిటీ ఏమైంది బాబు?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైనారిటీల మీద కపట ప్రేమ చూపుతున్నారని ఏపీ, తెలంగాణ ఆల్ ఇండియా జమతే ఉలమా ఏ హింద్ ఉపాధ్యక్షుడు ముఫ్తి ఫారూఖ్ విమర్శించారు. సోమవారం లోటస్ పాండ్ లోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మైనారిటీ నాయకుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా ముస్లింల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముస్లిలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మైనారిటీలు వద్దని, వారి ఓట్లు మాత్రమే కావాలన్నారు. ఇంతవరకు మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, టికెట్స్ కూడా సరిగా కేటాయించలేదని దుయ్యబట్టారు. గత ఎన్నికలలో ఇచ్చిన మైనారిటీ యూనివర్సిటీ హామీ సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఒక్క కార్పొరేషన్ కూడా ముస్లింలకు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తానంటే ఎలా నమ్ముతారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సముచితన స్థానం కల్సిస్తుందని ప్రశంసించారు. ఏపీలోని ముస్లింలందరు, అన్ని వర్గాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. -
‘బ్రిటీష్ పాలనకంటే ఘోరంగా బాబు పాలన’
సాక్షి, కడప : తనను ప్రశ్నిస్తే జైలుకే అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీల అక్రమ అరెస్టులపై వారు ధ్వజమెత్తారు. మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నారా హమారా, టీడీపీ హమారా.. ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మైనారిటీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించని బాబుకు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి భూటకపు ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. మైనారిటీలను వేధిస్తుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. బాబును ఊరికే పొగడాలంటే తమ వల్ల కాదని అన్నారు. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అడగటం నేరమా అని ప్రశ్నించారు. -
'చంద్రబాబు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు'
నంద్యాల: ముస్లిం ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టాలని సీఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేతలు మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను మభ్యపరచడానికే.. ఆ పార్టీ నేతలు తమ కండువాలతో ప్రచారం చేయొద్దని చెప్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబును మైనారిటీలు ఎవ్వరూ నమ్మబోరని స్పష్టం చేశారు. 85శాతం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు ముస్తఫా, రెహ్మాన్ తదితరులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ముస్లిం ప్రజలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని వారు గుర్తుచేశారు. ముస్లింలపై దొంగ ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు మాత్రం తన కేబినెట్లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా చోటు కల్పించలేదని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో యోగిఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ సర్కారు ఉన్నప్పటికీ, అక్కడసైతం ఒక ముస్లిం నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారని, కానీ, అంతకన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఒంటిరిగా పోరాడేశక్తి చంద్రబాబుకు లేదని, అందుకే ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు రాదని, బాబు పోతేనే జాబు వస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామని చంద్రబాబు చెప్తున్నారని, కానీ, రెండు గదుల్లో మాత్రమే ఉర్దూ వర్సిటీ నడుస్తున్న దారుణమైన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి ఆకాంక్ష
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ప్రత్యేక హోదా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని ఇండియన్ ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రత్యేకహోదా జన చైతన్య సైకిల్ ర్యాలీ విజయోత్సవ సభను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ, మైనార్టీ నాయకులు పార్టీలకతీతంగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు ప్రత్యేక హోదానే అన్నారు. ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబాబ్‌బాషా మాట్లాడుతూ అమరావతిలో తమకు చేదు అనుభవం ఎదురైందని, అక్కడ సచివాలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వినతి పత్రాన్ని ముఖ్య కార్యదర్శికి అందజేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు అబ్దుల్‌హక్, అబ్దుల్ జబ్బార్, జిల్లా సహాయకార్యదర్శి బాబా ఫకృద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలుసాబ్, ఇన్సాఫ్ జిల్లా కన్వీనర్ బాషా, యూనస్, జాకీర్‌హుసేన్, జిలాన్ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు కోటపై మైనారిటీల కన్ను
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని గట్టిగానే ఢీ కొని నెల్లూరు నగరంలో తమ పట్టు పెంచుకోవాలని మైనారిటీ నేతలు నిర్ణయించారు. మేయర్ అబ్దుల్ అజీజ్‌పై అవినీతి ఆరోపణలు చేసినందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో లక్ష సంతకాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. మైనారిటీల బృందం త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి వివేకా మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో నగరంలో తమ పరపతి పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి టికెట్ డిమాండ్ చేసే శక్తిగా ఎదగాలని నిర్ణయించారు. అధికార పార్టీ మేయర్‌గా నగరంలో తన పరపతి పెంచుకుని వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బలంగా తయారు కావాలని మేయర్ అజీజ్ ఆశ పడుతున్నారు. తనకు స్వతహాగా అంత శక్తి లేకపోవడంతో మైనారిటీ ప్రతినిధిగా ఈ పనిచేయాలనే దిశగా కొంత కాలం నుంచి మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఆనం కుటుంబం టీడీపీలో చేరడంతో తన కోరిక నెరవేర్చుకోవడం కష్టమనే భావనతో పార్టీలో ఆనం వ్యతిరేక వర్గీయులను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నెల్లూరు నగర టీడీపీ బాధ్యతలు ఎలాంటి పరిస్థితుల్లో వివేకా కుటుంబానికి దక్కకుండా అడ్డుకునే ఏకైక అజెండాతో అజీజ్ టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చాలా దగ్గరయ్యారు. తెర చాటుగా జరుగుతున్న ఈ రాజకీయ సమీకరణలు గ్రహించిన ఆనం వివేకా అదను చూసి అజీజ్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఎదురు చూశారు. కార్పొరేషన్లో ఏసీబీ దాడుల నేపథ్యంలో అజీజ్‌పై రాజకీయ దాడి ప్రారంభించారు. అజీజ్‌కు పాలన చేత కాదనీ, విషయ పరిజ్ఞానం లేదనే అంశాన్ని జనంలోకి, పార్టీ పెద్దల్లోకి చొప్పించే వ్యూహంతో విమర్శల అస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంపై అజీజ్ ప్రతి విమర్శలకు దిగకుండా పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తారని అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా అజీజ్ ఈ వివాదానికి విజయవంతంగా ముస్లిం మైనారిటీ రంగు పూయగలిగారు. మైనారిటీ పెద్దలతో రహస్య సమావేశం ఆనం కుటుంబం తన మీద నేరుగా రాజకీయ దాడి ప్రారంభించిన నేపథ్యంలో అజీజ్ తనకు మద్దతునిచ్చే ముస్లిం మైనారిటీ పెద్దలతో రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సారి కూడా మైనారిటీ ఎమ్మెల్యే లేరనీ, వచ్చే ఎన్నికల నాటికి తామంతా ఐక్యంగా ఉండి బలంగా తయారైతే ఆ అవకాశం ఎవరో ఒకరికి వస్తుందని వీరంతా అంచనా వేసినట్లు సమాచారం. ఇదే సమయంలో వివేకా మీద తీవ్ర స్థాయిలోనే స్పందించాలని నిర్ణయించారు. వివేకా మతాన్ని కించపరచారనే కోణంలోనే ఆయన్ను ఫిక్స్ చేయాలనే వ్యూహం రూపొందించారు. ఇందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరంతా ఈ అంశం మీదే విరుచుకుపడ్డారు. మైనారిటీల దయతోనే వివేకా ఎమ్మెల్యే అయ్యారనే వాదన లేవదీశారు. లక్ష మందితో సంతకాలు సేకరించి వివేకా మీద సీఎం చంద్రబాబుకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేయాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. -
మైనారిటీలకు ‘మణిదీపం’ వైఎస్సార్ సీపీ
వైఎస్‌లాగే ముస్లింలకు అండగా జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లె, న్యూస్‌లైన్: మైనారిటీలకు మణిదీపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ నాయకులు మెట్రోబాబ్జాన్, 30 వ కౌన్సిలర్ వార్డు అభ్యర్థి మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకట్లో మగ్గుతున్న ముస్లిం మైనారిటీలకు దివంగత మాహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపారన్నారు. మతతత్వ బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలను ఊచకోత కోశారన్నారు. మోడీ తొలినుంచీ ముస్లింల వ్యతిరేకి అన్నారు. ఇదే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ పెంచకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. వైఎస్‌లాగే జగన్మోహన్రెడ్డి కూడా ముస్లిం మైనారిటీలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ఖాయమన్నారు. మదనపల్లెలో మతతత్వ బీజేపీతో కలిసి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం సిగ్గుగా ఉందన్నారు. ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మైనారిటీలను ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టణంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. గత దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న షాదీమహల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పారదర్శకంగా పనిచేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అన్నారు. మదనపల్లెలో తన ఆస్తులకన్నా ముస్లిం ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. కులమతాలకు అతీతంగా సేవచేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షమీం అస్లాం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసిన షాజహాన్‌బాషా షాదీమహల్‌ను పూర్తిచేయడంలో విఫలమయ్యారని, మైనారిటీలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. సమావేశంలో మైనారిటీ సీనియర్ నాయకులు బాబ్జాన్, నాయకులు ఎన్.బాబు, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఇర్ఫాన్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అడివిలోపల్లె గోపాల్‌రెడ్డి, పాల్ బాలాజీ, మస్తాన్‌ఖాన్, అహ్మద్, దావూద్, రఫీ, బుల్లెట్ షఫీ, ఖాజా, ఫిర్దోస్ ఖాన్, న్యాయవాది యహసానుల్లా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఎ కరీముల్లా, జింకా వెంకటాచలపతి, హర్ష వర్ధన్‌రెడ్డి, సురేంద్ర, కోటూరి ఈశ్వర్, అధిక సంఖ్యలో మైనారిటీలు, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలు పెద్దిరెడ్డి, తిప్పారెడ్డిలను ఘనంగా సన్మానించారు. -
బీజేపీతో పొత్తుపై ఏమంటారు?: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ పార్టీకి చెందిన మైనారిటీ నేతల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు అవకాశం లభిస్తే గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో ఏకాంతంగా భేటీ అయి పొత్తుల ప్రస్తావన చేయాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీల నుంచి పార్టీ పట్ల ఏమైనా వ్యతిరేకత వస్తుందా అన్న అంశంపై పార్టీ నేతల నుంచి ఆయన వివరాలు అడిగారు. సోమ, మంగళవారాల్లో పార్టీ మైనారిటీ నేతలు జాహెద్ ఆలీఖాన్, ఎన్ఎండీ ఫారూఖ్, ఎంఏ షరీఫ్, ఎంఏ సలీం, ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ, ముజఫర్ అహ్మద్ తదితరులతో ఇదే అంశంపై ఆయన చర్చలు జరిపారు. ఈ నేతలు బీజేపీతో పొత్తును వ్యతిరేకించారని, చంద్రబాబు పదేపదే అదే ప్రస్తావన చేయడంతో కొందరు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే మోడీని ప్రధాని కాకుండా చూడాలని సూచిస్తూ గోధ్రా అల్లర్లను ప్రస్తావించారని సమాచారం. గతంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నపుడు మతతత్వాన్ని ఎజెండాగా పెట్టుకున్న అద్వానీ ప్రధాని పీఠం ఎక్కాలని ప్రయత్నించినా అడ్డుకుని వాజ్‌పేయికి ఆ పదవి కట్టబెట్టారని, టీడీపీలాంటి పార్టీలు ఎన్డీఏలో చేరడం వల్ల బీజేపీ కూడా రానున్న రోజుల్లో మోడీని పక్కనపెట్టడమో, వ్యూహాత్మకంగా తెరవెనక్కి నెట్టడమో జరుగుతుందని బాబు విశ్లేషించారు. తెలంగాణకు కట్టుబడ్డ పార్టీగా బీజేపీ.. అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీలు కలవడం వల్ల ప్రయోజనం ఉంటుందని బాబు విశ్లేషించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పొత్తుల అంశం ప్రాథమిక దశలోనే ఉందనీ ఆయన వివరించారని చెప్పాయి.