అనంతపురం సప్తగిరి సర్కిల్ : ప్రత్యేక హోదా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని ఇండియన్ ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రత్యేకహోదా జన చైతన్య సైకిల్ ర్యాలీ విజయోత్సవ సభను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ, మైనార్టీ నాయకులు పార్టీలకతీతంగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు ప్రత్యేక హోదానే అన్నారు.
ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబాబ్‌బాషా మాట్లాడుతూ అమరావతిలో తమకు చేదు అనుభవం ఎదురైందని, అక్కడ సచివాలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వినతి పత్రాన్ని ముఖ్య కార్యదర్శికి అందజేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు అబ్దుల్‌హక్, అబ్దుల్ జబ్బార్, జిల్లా సహాయకార్యదర్శి బాబా ఫకృద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలుసాబ్, ఇన్సాఫ్ జిల్లా కన్వీనర్ బాషా, యూనస్, జాకీర్‌హుసేన్, జిలాన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరి ఆకాంక్ష
Published Thu, Oct 20 2016 11:34 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement