కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ స్కూళ్లలో 8434 ఉపాధ్యాయ ఖాళీలలను త్వరలో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం శాసన మండలిలో ప్రకటించారు. మండలిలో రెసిడెన్షియల్ పాఠశాలలపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన గురుకుల పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు బడ్జెట్‌లో రూ.2835 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోసం ఏటా రూ.లక్ష ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది వేతనాలను పెంచే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు.
నూతన రాష్ట్రంలో విద్యాలయాలు..
తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత కొత్తగా 577 గురుకులాలను ఏర్పాటు చేశామని కడియం తెలిపారు. మొత్తం 877 గురుకులాల్లో 2 లక్షల 70 వేల విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని కడియం తెలిపారు.33 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామనీ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment