
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల బదిలీలతో ఏర్పడిన ఖాళీల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను ఆదేశించారు. దీనికి త్వరితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ నెల 20లోపు యాజమాన్యాల వారీగా విద్యావలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీల వల్ల ఖాళీ అయిన చోట కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment