సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో అధికారులు గురువారం స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. అవకతవకలు జరిగాయని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జూబ్లీహిల్స్ పబ్లిక్, గీతాంజలి స్కూళ్లకు నోటిసులు పంపించారు. పూర్తి రికార్డులు సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై స‍్పందించిన స్కూళ్ల యాజమాన్యాలు డీఈవోకు రికార్డులు సమర్పించారు. స్కూళ్ల యజమాన్యాలు ఇప్పటికే జీవో నెంబర్ 46ను ఉల్లంఘించాయని అధికారులు తెలుసుకున్నారు. వీటితో పాటు మెరిడియన్, నీరబ్ పబ్లిక్ స్కూళ్లల్లో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment