బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | applications to backlog seats of gurukula schools | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Apr 8 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

applications to backlog seats of gurukula schools

చిలమత్తూరు (హిందూపురం) : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లోని 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీ సీట్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, టేకులోడు గురకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం బాలికలకు 12, బాలురకు 32 సీట్లు ఖాళీగా ఉన్నందున శాసనకోట పాఠశాలలో బాలికలకు, పేరూరు, పెన్నహోబిలం, లేపాక్షి పాఠశాలలో బాలురకు అవకాశం ఉందన్నారు.

6వ తరగతిలో 13, 7వ తరగతిలో 8 సీట్లు, 8వ తరగతిలో 7, 9వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయన్నారు.  టేకులోడు, పేరూరు, లేపాక్షి, శాసనకోట, పెన్నహోబిలం పాఠశాలలో ఈ నెల 10 నుంచి ఉచితంగా దరఖాస్తులు పొందొచ్చన్నారు. దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోపు పాఠశాలలో అందజేయాలన్నారు.ఈనెల 20న టేకులోడు గురుకుల పాఠశాలలో ఉదయం 11 గంటలకు పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ : 98665 59655లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement