భర్తీ చేసేందుకు సర్కారు అనుమతి
పాఠశాలల్లో 1,164,
డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులు
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,794 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో గురుకుల పాఠశాలల్లో 1,164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. గతంలో అనుమతించిన 758 పోస్టులకు ఇవి అదనమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఐఎస్) ఆధ్వర్యంలో బాల బాలికలకు 103 గురుకుల పాఠశాలలు, మహిళలకు 30 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసింది. వాటిల్లో అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా కొత్త పోస్టుల వివరాలను వెల్లడించడంతో పాటు భర్తీకి చేపట్టాల్సిన చర్యలను ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి వీలుగా అవసరమైన రోస్టర్ పాయింట్లు, అర్హతలు, లోకల్ కేడర్, సబ్జెక్ట్‌ల వారీ వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖకు సూచించింది.
గురుకుల పాఠశాలల్లో పోస్టులు
ప్రిన్సిపాల్ 31
టీజీటీ 721
పీఈటీ 103
ఆర్ట్ టీచర్ 47
మ్యూజిక్ టీచర్ 56
లైబ్రేరియన్ 103
స్టాఫ్ నర్స్ 103
మొత్తం 1,164
గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో పోస్టులు
ప్రిన్సిపాల్ 30
డిగ్రీ లెక్చరర్లు 510
లైబ్రేరియన్ 30
పీడీ 30
హెల్త్ సూపర్‌వైజర్ 30
మొత్తం 630
గురుకుల విద్యాలయాల్లో 1,794 పోస్టులు
Published Thu, Aug 4 2016 2:38 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement
Advertisement