
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం వేలాది మంది పోటీ పడడం ఏ రాష్ట్రంలో లేదని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మంగళవారం ఖైరతాబాద్ బాలికలు, సనత్‌నగర్‌లో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజ నం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.