పొలంలోనే మీడియాతో మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జెడ్పీ చైర్‌పర్సన్ వసంత
పొట్ట దశలో ఎండుతున్న పంట పొలాలు
పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించా రు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడ్‌పల్లి గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం పరిశీలించా రు. ఎస్సారెస్పీ పంప్‌హౌజ్ ద్వారా సాగునీరు వ స్తుందనే ఆశతో రెండు గ్రామాల రైతులు సుమారు 1800 ఎకరాల్లో వరి సాగుచేశారని, పొట్టదశలో సా గునీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
సుందిల్ల, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నుంచి లక్ష ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉన్నా.. ప్ర భుత్వం పట్టించుకోకుండా గత ప్రభుత్వాన్ని బద్‌నాం చేయాలనే అక్కసుతోనే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. కోపముంటే బీఆర్‌ఎస్ నాయకులపై తీర్చుకోవాలేగానీ రైతులపై కాదన్నారు. ప దేళ్లలో ఎన్నడూ గుంట భూమి కూడా ఎండిపోలేద ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 1800 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఇరవై ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో ఏ రోజూ ఇలాంటి పరి స్థితి రాలేదన్నారు. వేంనూర్ పంప్‌హౌజ్ నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా రైతులకు నీరందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. వెంటనే వేంనూర్ పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఆయన వెంట జె డ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీ మల్లేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment